మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ దక్కకపోవడంతో జీర్ణించుకోలేని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన బొల్గంరాజు అనే యువజన కాంగ్రెస్ కార్యకర్త పొన్నాలకు టికెట్ విషయంలో జరుగుతున్న పరిణామాలను మీడియాలో తెలుసుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఇవాళ విడుదల చేసిన కాంగ్రెస్ రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. పెట్రోల్ బాటిల్ తీసుకుని గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని.. పొన్నాలకు అనుకూలంగా నినాదాలు చేశాడు.

వెంటనే చేతిలో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న నేతలు, కార్యకర్తలు రాజును అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య ఫోన్ ద్వారా రాజును పరామర్శించారు. 

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ