హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నుండి పోటీ చేయాలనే ఆలోచనను టీజేఎస్ చీఫ్ కోద్ండరామ్  విరమించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ స్థానం నుండి  గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిథ్యం వహించాచు.  

పొన్నాల లక్ష్మయ్యకు తొలి జాబితాలో సీటు దక్కలేదు.  దీంతో  బీసీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో  పోటీ నుండి జనగామ నుండి  కోదండరామ్ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకొన్నారు.

జనగామ నుండి  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేయాలని భావించారు.దరిమిలా కాంగ్రెస్ పార్టీ  తొలి జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు ప్రకటించలేదు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ  ప్రకటించిన 65 స్థానాల్లో  13 మంది బీసీలకు మాత్రమే టికెట్లు కేటాయించడం, పొన్నాలకు టికెట్టు కేటాయించకపోవడంపై బీసీ సంఘాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర బంద్ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకే  టికెట్టు రాకపోవడంపై బీసీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడ అంతర్మథనంలో పడింది.

ఇదే విషయమై టీజేఎస్‌లో కూడ చర్చ జరిగింది. మంగళవారం నాడు సమావేశమైన టీజేఎస్ నేతలు  కోదండరామ్ ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై చర్చించారు. జనగామ నుండి  కోదండరామ్ పోటీ చేయాలనుకొన్న తరుణంలో పొన్నాల లక్ష్మయ్యను పక్కనపెట్టి కోదండరామ్ పోటీకి దిగితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడ టీజేఎస్ నేతలు భావించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో జనగామ నుండి  టీజేఎస్ పోటీ చేసే  ఆలోచనను విరమించుకోవాలని  నిర్ణయం తీసుకొన్నాయి.   ఇదే విషయాన్ని టీజేఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాల్సిన సమయంలో ఇప్పటికే  కాంగ్రెస్ జాబితాపై బీసీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నందున పొన్నాల స్థానంలో  కోదండరామ్ పోటీ చేయడం వల్ల  రాజకీయంగా టీఆర్ఎస్‌కు ప్రయోజనమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు కూడ భావించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు  పొన్నాల లక్ష్మయ్యతో కూడ మంగళవారం నాడు చర్చించారు. జనగామ నుండి సీటు తనకే వస్తోందనే ధీమాతో పొన్నాల లక్ష్మయ్య కూడ ఉన్నారు. మరో వైపు టీజేఎస్ కూడ  జనగామ బరిలో నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో జనగామ నుండి  పొన్నాల లక్ష్మయ్యకు టికెట్టుకు లైన్ క్లియరైంది.

సంబంధిత వార్తలు

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కాంగ్రెస్ జాబితాపై బీసీల మండిపాటు, బంద్‌కు పిలుపు: ఆర్. కృష్ణయ్య

ఉత్తమ్ తో పాటు భార్యకూ టికెట్: కాంగ్రెసు తొలి జాబితా, అభ్యర్థులు వీరే

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య