Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేళ్ల కొడుకును కొరడాలతో కొట్టి చిత్రహింసలు పెట్టిన తండ్రి, కూతురితో వీడియో తీయించి అరాచకం, అరెస్ట్..

బాలుడిపై దాడి జరిగిందని తెలుసుకున్న అతని తల్లి తన భర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 324, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న బాలుడి తండ్రి కర్ర తీసుకుని బాలుడిని కొట్టాడు. బాలుడిని అలా చాలా సేపు కొడుతూనే ఉన్నాడు. అంతేకాదు కొట్టేటప్పుడు ఆ సంఘటనను తన ఫోన్‌లో బంధించమని తండ్రి తన కుమార్తెను కోరాడు.

father arrested for flogging and Torturing his 8-year-old son in Hyderabad
Author
Hyderabad, First Published Nov 29, 2021, 12:02 PM IST

హైదరాబాద్ : పిల్లలు అల్లరి చేయడం సహజమే. మామూలుగా కొంతమంది పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తారు. బైటికి వెళ్లినప్పుడు కామ్ గా ఉంటారు. మరికొంతమంది పిల్లలు బైటికి వెడితే తమ విశ్వరూపం చూపిస్తారు. వేరేవాళ్లముందు తల్లిదండ్రులు ఏమీ అనరన్న కాన్ఫిడెన్స్ కావచ్చు. లేదా కొత్త ప్రదేశంలో అత్యుత్సాహం కావచ్చు. అయితే ఇదే ఓ చిన్నారికి దారుణమైన హింసను చూపించింది. 

వివరాల్లోకి వెడితే.. తన ఎనిమిదేళ్ల కుమారుడిని దారుణంగా flogging చేసిన వ్యక్తిపై ఛత్రినాక పోలీసులు Criminal case నమోదు చేశారు. బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు తన కుమారుడు బాగా అల్లరి చేస్తున్నాడని, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతను ఈ  అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.

బాలుడిపై attack జరిగిందని తెలుసుకున్న అతని తల్లి తన భర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 324, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న బాలుడి తండ్రి Stick తీసుకుని బాలుడిని కొట్టాడు. బాలుడిని అలా చాలా సేపు కొడుతూనే ఉన్నాడు. అంతేకాదు కొట్టేటప్పుడు ఆ సంఘటనను తన ఫోన్‌లో బంధించమని తండ్రి తన కుమార్తెను కోరాడు.

 "బాలుడు తన అత్తను ఇబ్బంది పెట్టడంతో, ఆమె అతని తండ్రికి ఫిర్యాదు చేసింది," అని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ STOI కి తెలిపారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నిందితుడు సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. 

‘కోల్డ్ కేస్’ సినిమా చూసి.. కూల్ గా హత్య.. మీసేవ ఆపరేట్ హత్యకేసులో సంచలనం...

ఇలాంటి ఘటనే నవంబర్ 24న రాజస్థాన్ లో జరిగింది. ఒక తండ్రి తన ఎనిమిదేళ్ల కొడుకుతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తలకిందులుగా వేలాడదీసి చితగ్గొట్టాడు. ‘కిందకు దింపు.. కిందకు కుదింపు..’ అని ఆ చిన్నారి ఎంత వేడుకున్నా కనికరించలేదు. బూతులు తిడుతూ చంపేస్తానని thretan చేశాడు. home work చేయకుండా ఆడుకోవడానికి వెళ్లడమే ఆ బాలుడు చేసిన తప్పు.. ఆ మాత్రం దానికే ఆ తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు.

రాజస్థాన్ లోని  ఛిత్తోర్ గఢ్ లో  ఈ ఘటన జరిగింది. ఛిత్తోర్ గఢ్ కు  చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం school నుంచి వస్తూనే హోంవర్క్ రాసుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళాడు.  డ్యూటీ నుంచి వచ్చాక father ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు.

కొడుకుని పట్టుకొని తలకిందులుగా వేలాడదీశాడు. కర్రతో కొట్టాడు.  బాలుడు ఎంతగా ప్రాధేయ పడుతున్నా కనికరించలేదు.  బాలుడి తల్లి అడ్డుపడినా అతను ఆగలేదు.  దీంతో తట్టుకోలేకపోయిన ఆ mother  భర్త తన కొడుకును చిత్రహింసలు పెడుతున్న ఘటన వీడియో తీసింది. ఆ వీడియోను తన సోదరుడికి పంపించింది. అతను ఆ వీడియోను పోలీసులకు చూపించి తన బావపై  ఫిర్యాదు చేశాడు. Child Life Numberకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios