Asianet News TeluguAsianet News Telugu

‘కోల్డ్ కేస్’ సినిమా చూసి.. కూల్ గా హత్య.. మీసేవ ఆపరేట్ హత్యకేసులో సంచలనం...

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి ఖాజీపల్లికి చెందిన మీసేవ ఆపరేటర్ కాంపెల్లి శంకర్ శనివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడి మృతదేహాన్ని ముక్కలు చేసిన నిందితుడు గోదావరిఖని వన్ టౌన్, టూ టౌన్, ntpc  బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శరీర భాగాలను పడేశాడు. మృతుడి తల,  చేయి  రాజీవ్ రహదారి సమీపంలోని మల్యాల పల్లి స్టేజీ వద్ద ఉన్న ముళ్లపొదల్లో లభించాయి.

peddapalli meeseva operator murder case update
Author
Hyderabad, First Published Nov 29, 2021, 9:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్ :  ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ‘కోల్డ్ కేస్’  అనే మలయాళీ Suspense thriller movie చూసి.. అచ్చం అలాగే హత్యకు ప్లాన్ చేశాడు ఓ వ్యక్తి.  పక్కా ప్లాన్ తో ఓ యువకుడిని హతమార్చి తల ఒక చోట, ఇతర శరీర భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.  ఇక పోలీసులకు దొరికేది లేదని అనుకున్నాడు. కానీ,  కానీ సదరు హంతకుడిని పోలీసులు పక్కాగా పట్టేశారు అని సమాచారం. అతడిని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి అని తెలిసింది.

ఈ కేసును సవాలుగా తీసుకున్న రామగుండం కమిషనరేట్ పోలీసులు స్థానికులు కొందరుఇచ్చిన సమాచారంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని  
Sean Reconstruction నిర్వహించారని తెలిసింది.  ఈ క్రమంలో ఎలా murder చేసింది.. శరీర భాగాలను ఎక్కడెక్కడ విసిరేసింది.. నిందితుడు చెప్పినట్లు సమాచారం. 

అసలేం జరిగిందంటే…
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి ఖాజీపల్లికి చెందిన Meeseva Operator కాంపెల్లి శంకర్ శనివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడి dead bodyని ముక్కలు చేసిన నిందితుడు గోదావరిఖని వన్ టౌన్, టూ టౌన్, ntpc  బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శరీర భాగాలను పడేశాడు. మృతుడి తల,  చేయి  రాజీవ్ రహదారి సమీపంలోని మల్యాల పల్లి స్టేజీ వద్ద ఉన్న ముళ్లపొదల్లో లభించాయి.

ఈ క్రమంలోనే అనుమానితుడైన రాజు ఉండే క్వార్టర్ ను పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు.  హత్య సమయంలో ధరించిన దుస్తులు, ఉపయోగించిన వస్తువులను క్వార్టర్ ప్రాంగణంలోనే నిందితుడు కాల్చేసినట్టు గుర్తించారు. 

హత్య చేసి.. తల, కాళ్లు, మొండెం వేరు చేసి.. పెద్దపల్లిలో దారుణం...

‘కోల్డ్ కేస్’ సినిమా చూసి... 
‘కోల్డ్ కేస్’  సినిమాలోని లాయర్ పాత్రధారి..  తన క్లయింట్ కు భరణం కింద వచ్చిన డబ్బును కాజేయడానికి అత్యాశతో సదరు క్లయింట్ ను హత్య చేసి, శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో చుట్టి... కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విసిరి వేస్తుంది.  వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో body parts దొరకడంతో అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ సినిమా ప్రేరణతోనే శంకర్ హత్య చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పినట్లు తెలిసింది.

రాజు, శంకర్ భార్య, మరికొందరి ప్రమేయం హత్య వెనుక ఉన్నట్లు ప్రచారం అవుతున్నా.. తానొక్కడినే ఈ పని చేసినట్లు రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. extramarital affairతో పాటు, కొన్ని అభ్యంతరకర ఫోటోలను  రాజు వాట్సాప్ లో  అప్లోడ్ చేయడంతో గొడవ జరిగిందని ఈ క్రమంలోనే శంకర్ హత్యకు గురయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సైకోలా ప్రవర్తన…
కొన్నేళ్లక్రితం భార్యతో గొడవపడిన రాత్రి ఒక్కడే ఎన్టిపిసి టెంపరరీ టౌన్షిప్ లో ఉంటున్నాడు.  మద్యం,  గంజాయికి అలవాటు పడిన అతని ప్రవర్తన 
Psychoలా ఉంటుందని పలువురు చెబుతున్నారు. హత్య చేసినప్పటి దుస్తులతోనే  మర్నాడు  స్థానిక టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లగా..  కొందరు వాసన గుర్తుపట్టి నిలదీశారు. దీంతో  తాను వాంతులు చేసుకోవడం వల్ల  వాసన వస్తోందని చెప్పి  అక్కడి నుంచి జారుకున్నాడు అని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios