రోడ్డుపై నడిచివెడుతున్న యువతిని వివస్త్రను చేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిచి వెడుతున్న ఓ యువతి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. బాలాజీ నగర్ బస్టాండ్ దగ్గర ఓ యువతి (26) నడుచుకుంటూ వెడుతోంది. ఆ యువతిని చూసిన పెద్దమారయ్య (30) ఆమె వెంటపడి నడిరోడ్డులో వివస్త్రను చేశాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పదినిమిషాల పాటు ఈ దారుణం జరుగుతున్నా ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఆమెను వివస్త్రను చేసిన తరువాత ఆ కీచకుడు మరో మహిళ మీద దాడికి ప్రయత్నించినట్టు సమాచారం. అతను అక్కడినుంచి వెళ్లాక.. బాధితురాలికి కవర్లు కప్పి కాపాడారు. పోలీసులకు సమాచారం తెలియడంతో అతడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.