హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. నగర శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ఓ కంపెనీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో ఆరుగురిని అరెస్టు చేసి.. వారి వద్ద నుండి 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబయి కేంద్రంగా చేసుకొని ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

అయితే, ఈ డ్రగ్స్ ముఠా హైదరాబాద్‌లో రా మెటిరీయల్స్‌ను తయారు చేసి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ముంబయికి సరఫరా చేస్తున్నారు. మెపిడ్రిన్‌తో ఎండీఎంఏ, కొకైన్, అంపెటమిన్ మొదలగు డ్రగ్స్‌ను తయారీ చేసి మియావ్ డ్రోన్ పేర్లతో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నారు. ఈ ముఠా హైదరాబాదులోని కాలేజీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.