Hyderabad : బూజుపట్టిన క్యాడ్ బరీ చాక్లెట్ ... దీంతోనే  తియ్యని వేడుక చేసుకోవాలా..?

మీ పిల్లలు అడగ్గానే వెనకాముందు చూడకుండా చాక్లెట్స్ కొనిపెడుతున్నారా?  అయితే మీకు హైదరాబాద్ లో వెలుగుచూసిన ఈ ఘటన తెలియాల్సిందే.... 

Hyderabad resident discovers fungus on Cadbury Dairy Milk Chocolate AKP

హైదరాబాద్ : తియ్యని వేడుక చేసుకుందాం... అంటూ టీవీల్లో వచ్చే క్యాబ్ బరీ డైరీ చాక్లెట్ యాడ్ చూసే వుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే మంచి జరగడం మాటేమో గానీ మంచాన పడటం ఖాయంగా కనిపిస్తోంది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా ఊరించే ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియజేసే ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ అమీర్ పేట మెట్రో  స్టేషన్ వద్ద ఓ ప్రయాణికుడు క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడట. ఎంతో ఇష్టంగా ఆ చాక్లెట్ ను తినేందుకు సిద్దమైన అతడు కవర్ తీయగానే ఆశ్చర్చపోయాడు. చాక్లెట్ మొత్తం బూజుపట్టి వుండటంతో అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ చాక్లెట్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

'దట్ హైదరబాదీ పిల్ల' పేరిట వున్న ఎక్స్ అకౌంట్ లో ఈ డైరీ మిల్స్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తాను కొన్న డైరీ మిల్స్ చాక్లెట్ జనవరి 2024 లో తయారయ్యింది... ఇది 12 నెలల వరకు బాగుంటుందని కంపనీ పేర్కొంది. కానీ చాక్లెట్ కవర్ తెరిచిచూస్తే ఇదీ పరిస్థితి అంటూ బూజుపట్టిన చాక్లెట్ ఫోటోలు పెట్టారు. ఈ ట్వీట్ ను డైరీ మిల్స్ సంస్థకు కూడా ట్యాగ్ చేసాడు. 

 

ఈ ఘటనతో డైరీ మిల్స్ చాక్లెట్ కంపనీపై నెటిజన్లు  ఫైర్ అవుతున్నారు. ఇదే చాక్లెట్ చిన్నపిల్లలు చూసుకోకుండా తినివుంటే పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఫుడ్ సెప్టీ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అలాగే పెద్దవాళ్లు ముందు చాక్లెట్ ను పరిశీలించిన తర్వాతే పిల్లలకు ఇవ్వాలని సూచిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios