హైదరాబాద్: పొత్తులతో  రేపు సాయంత్రానికి స్పష్టత వస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత జానారెడ్డి చెప్పారు. చంద్రబాబును  బూచిగా చూపి కేసీఆర్  సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని  ఆయన విమర్శలు గుప్పించారు.

శుక్రవారం నాడు  తన నివాసంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీలకు గత ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే సీట్లను కేటాయించనున్నట్టు  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి చెప్పారు.

పొత్తుల్లో భాగస్వామ్య పార్టీల పరస్పర సహకారం అవసరమని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.భాగస్వామ్య పార్టీలు వారికి ముఖ్యమైన సీట్లు అడుగుతున్నారు. కానీ, ఆ స్థానాలు మాకు కూడ ముఖ్యమైనవి ఉంటే భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పరం చర్చించుకొని నిర్ణయం తీసుకొంటాయన్నారు.

టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకు మూడు లేదా నాలుగు సీట్లను కేటాయించనున్నట్టు  జానారెడ్డి ప్రకటించారు.భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.రేపు సాయంత్రానికి భాగస్వామ్య పార్టీలకు కేటాయించే సీట్లు, సంఖ్యపై స్పష్టత వస్తోందని జానారెడ్డి ప్రకటించారు.

 మూడు మాసాల ముందు అభ్యర్థులను ప్రకటించారా అని జానారెడ్డి ప్రశ్నించారు.అకారణంగా 9 మాసాల ముందు అసెంబ్లీని ఎవరైనా దేశంలో రద్దు చేశారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌తో తమకు పోలికే లేదన్నారు.

చంద్రబాబునాయుడు మా పార్టీతో కలిసి వస్తున్నారని ఆయన చెప్పారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, .. ఇతరత్రా కారణాలతో టీడీపీతో పొత్తు పెట్టుకొంటున్నట్టు ఆయన చెప్పారు. అవసరం కొద్ది కేసీఆర్‌ను కూడ చంద్రబాబు గతంలో కలిసినట్టు ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌తో తాము ఏనాడూ కూడ కలవలేదన్నారు. 

ఫెడరల్ ప్రంట్ అంటూ  గతంలో కేసీఆర్ ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాడని జానారెడ్డి ప్రశ్నించారు.ఫెడరల్ ఫ్రంట్  ఒట్టిదేనని తాము ఆనాడే చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఫైపల్ చేసేందుకు గాను  మేమంతా ఢిల్లీలో ఉన్నాం...  అదే సమయంలో రాహుల్‌ను కలిసేందుకు ఢిల్లీకి చంద్రబాబునాయుడు వచ్చాడు రెండు పార్టీలు తెలంగాణలో కలిసి పోటీ చేయాలనుకొంటున్నాం. ఈ తరుణంలో బాబును కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని జానారెడ్డి విమర్శలు చేశారు. గతంలో కూడ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారని  ఆయన గుర్తుచేశారు.

మేం ఓ లక్ష్యంతో  కూటమిగా ఏర్పాటైతే తప్పేమిటని ఆయన కేసీఆర్ ప్రశ్నించారు.తెలంగాణ ప్రాజెక్టులు, అభివృద్ధి విషయంలో బాబు అడ్డుపడితే మేం ఊరుకొంటామా అని ఆయన ప్రశ్నించారు.

ఏపీ రాష్ట్రాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను నిర్మిస్తామని జానారెడ్డి చెప్పారు. ఏ రాష్ట్రమైనా తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రయత్నాలు చేస్తాయన్నారు. గతంలో  కూడ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలు తమ రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా పొరుగు రాష్ట్రాలపై ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు.

కూటమి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేదన్నారు. చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే  తాము సహించబోమన్నారు.తెలంగాణ అభివృద్ది, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం కూటమి ఏర్పడిందన్నారు. సీట్ల విషయం ముఖ్యం కాదన్నారు.

 

సంబంధిత వార్తలు

తుది దశలో సీట్ల సర్దుబాటు: జానారెడ్డి

కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయం: కోదండరామ్

తేలని సీట్ల లెక్క: కోదండరామ్‌తో చర్చలకు జానారెడ్డి రెడీ

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?