హైదరాబాద్: మహా కూటమిలోని పార్టీల మధ్య  సీట్ల సర్ధుబాటు విషయం  తుది దశకు చేరుకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బీసీలు  సహకరించాలని  ఆయన కోరారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామని  ఆయన హమీ ఇచ్చారు.

శుక్రవారం నాడు  మధ్యాహ్నం  హైద్రాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య జానారెడ్డితో సమావేశమయ్యారు. బీసీల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన కోరారు.

ఈ సమావేశం తర్వాత జానారెడ్డి ఆర్. కృష్ణయ్యతో కలిసి  మీడియాతో మాట్లాడారు. బీసీల సమస్యలపై  ఆర్. కృష్ణయ్య సమర్పించిన వినతి పత్రంలో అంశాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చేలా మాట్లాడినట్టు ఆయన చెప్పారు. బీసీల సంక్షేమం కోసం  కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ విషయాలను  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు.

బీసీల జాబితా నుండి  తొలగించిన 26 కులాలను తమ ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన వెంటనే  తిరిగి చేర్చుతామని  ఆయన  హమీ ఇచ్చారు. మేనిఫెస్టోలో చేర్చేందుకు వీలుగా లేని  అంశాలను  ప్రత్యేకంగా పార్టీ నేతలతో చర్చించి  వాటిని కూడ అమలు చేసేలా తాను బాధ్యత తీసుకొంటానని ఆయన చెప్పారు.

ఆరు మాసాలుగా  తాము అధికారంలోకి వస్తే  చేపట్టబోయే  కార్యక్రమాలకు సంబంధించి బహిరంగంగానే చెప్పిన విషయాలను జానారెడ్డి గుర్తు చేశారు. తమ మేనిఫెస్టోలోని అంశాలనే టీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు.  తాము ప్రకటించిన అంశాలకు బడ్జెట్ సరిపోదని కేసీఆర్, కేటీఆర్‌లు విమర్శలు గుప్పించారని ఆయన గుర్తు చేశారు.

టీఆర్ఎస్ నేతలు తమ మేనిఫెస్టోను అమలు చేసేందుకు  నిధులను ఎక్కడి నుండి తీసుకొస్తారని జానారెడ్డి  ప్రశ్నించారు.  మహా కూటమిలోని పార్టీల మధ్య  సీట్ల సర్ధుబాటు విషయం  తుది దశకు చేరుకొందన్నారు. సీట్ల సర్దుబాటు కోసం  పార్టీ ఏర్పాటు చేసిన కోర్ కమిటీకి, మహాకూటమిలోని పార్టీలకు మధ్య తాను వారధిగా పనిచేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయం: కోదండరామ్

తేలని సీట్ల లెక్క: కోదండరామ్‌తో చర్చలకు జానారెడ్డి రెడీ

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?