కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయం: కోదండరామ్
తాము కాంగ్రెస్ పార్టీ గుర్తులపై పోటీ చేయబోమని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు
హైదరాబాద్: తాము కాంగ్రెస్ పార్టీ గుర్తులపై పోటీ చేయబోమని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు ముగించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తైందన్నారు. ఎన్నికల గుర్తు కోసం కూడ తమ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి పంపినట్టు చెప్పారు. గుర్తు కూడ ఎన్నికల సంఘం ఫైనల్ చేయనుందన్నారు.
కాంగ్రెస్ పార్టీతో చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు.
అక్టోబర్ 20వ తేదీన హైద్రాబాద్ పర్యటనకు వచ్చే రాహుల్ గాంధీని తాము కలవబోమని చెప్పారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై మాట్లాడబోనని చెప్పారు. ఆ మేనిఫెస్టోలో కొత్తగా ఏముందని ఆయన ప్రశ్నించారు. కామన్ ఎజెండా, సీట్ల సర్ధుబాటుపై చర్చించినట్టు ఆయన తెలిపారు.
ఉమ్మడి ఎజెండా పూర్తైతే ప్రజల ముందు ఉంచుతామన్నారు. సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలమైన వాతావరణం కన్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు
తేలని సీట్ల లెక్క: కోదండరామ్‌తో చర్చలకు జానారెడ్డి రెడీ
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?