తేలని సీట్ల లెక్క: కోదండరామ్‌తో చర్చలకు జానారెడ్డి రెడీ

మహా కూటమి (ప్రజా కూటమి)లోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా పూర్తి కాలేదు. 

Congress leader Jana reddy ready to discuss with TJS chief Kodandaram

హైదరాబాద్: మహా కూటమి (ప్రజా కూటమి)లోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా పూర్తి కాలేదు. శుక్రవారం నాడు  టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌తో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చర్చించారు.  కానీ, సీట్ల సర్ధుబాటు కొలిక్కి రాలేదు.  దీంతో మరోసారి కోదండరామ్‌తో ఇవాళ సాయంత్రమే కాంగ్రెస్ నేత జానారెడ్డి  సమావేశం కానున్నారు.

హైద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు టీజేఎస్ చీఫ్  కోదండరామ్‌తో  శుక్రవారం నాడు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో సీట్ల సర్ధుబాటుపై  ఈ రెండు  పార్టీల మధ్య ఏకాభిప్రాయం  కుదరలేదు.

టీజేఎస్‌ నేతలు మాత్రం కనీసం 12 సీట్లు తమకు కట్టబెట్టాలని కోరుతున్నారు. కానీ, కనీసం 8 సీట్లు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని  కాంగ్రెస్ పార్టీ నేతలు  చెబుతున్నారు.  కామన్ ఎజెండా, సీట్ల సర్ధుబాటుపై చర్చించారు.అయితే  కాంగ్రెస్ పార్టీ తరపున సీట్ల సర్ధుబాటు బాధ్యతలను  జానారెడ్డికి అప్పగించారు.

దీంతో  జానారెడ్డి రంగంలోకి దిగనున్నారు.  శుక్రవారం నాడు సాయంత్రం మరోసారి కోదండరామ్ తో  జానారెడ్డి సమావేశం కానున్నారు.  ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. 

టీజేఎస్‌తో పాటు  టీడీపీ, సీపీఐ నేతలతో కూడ ఇవాళే చర్చించాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. అయితే టీజేఎస్‌తో చర్చలు పూర్తి కానందు, మిగిలిన రెండు పార్టీలతో ఎప్పుడు చర్చిస్తారనేది  ఇంకా  స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios