Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు బీజేపీ చెక్: హైద్రాబాద్‌లో భారీ సభ, అమిత్‌షా, పవన్‌లు హాజరయ్యే ఛాన్స్

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్ఆర్‌పీలకు మద్దతుగా బీజేపీ హైద్రాబాద్‌లో  భారీ సభను  నిర్వహించాలని భావిస్తోంది. త్వరలోనే బహిరంగ సభ నిర్వహించే తేదీలను పార్టీ ప్రకటించనుంది. 

bjp plans to conduct meeting in hyderabad for supporting caa,nrc,nrp
Author
Hyderabad, First Published Feb 13, 2020, 3:10 PM IST


హైదరాబాద్: తెలంగాణలో బిజెపి త్వరలో భారీ  బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సి ఏ ఏ, ఎన్ఆర్సీ, ఎన్ పి ఆర్  వంటి  అంశాలకు మద్దతుగా మార్చి మొదటి వారంలో భారీ సభ నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 తెలంగాణ ప్రభుత్వం సీఏఏ, ఎన్ ఆర్సీ , ఎన్ పి ఆర్ లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిజెపి తమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఏ ఏకు  వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని కేసీఆర్ వెల్లడించడంతో సీఏఏపై ప్రజలకు పూర్తి  అవగాహన కల్పించేందుకు బిజెపి పావులు కదుపుతోంది.

 ఇప్పటికే జిల్లా స్థాయిలో బీజేపీ సమావేశా లు నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలో  పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి భారీ బహిరంగ సభను నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో తెలంగాణ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు ?

 ఈ బహిరంగ సభకు ఇటీవలే బిజెపితో చేతులు కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జాతీయ  నేతలను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ను ఇప్పటికే రాష్ట్ర బిజెపి నేతలు సభకు సమయం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. 

పార్లమెంట్ సమావేశాలు కుడా ఉన్న నేపథ్యంలో  అమిత్ షా సమయం ప్రకారం సభకు ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. సిఏఏ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా హైదరాబాద్ నుంచే ప్రణాళికలు అమలు అవుతుండడంతో హైదరాబాద్ లో సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఏ ఏ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.  దీంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి  ఎం ఐ ఎం, టిఆర్ ఎస్ ల వైఖరిని ఎండగట్టే ఉద్దేశ్యం తో సభను బీజేపీ  ఇక్కడ ఇర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 త్వరలో బహిరంగ సభ తేదీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..తెలంగాణా అసెంబ్లీ తీర్మానం అనంతరం సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే  అంశపై పై పార్టీలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios