BRS Meeting: బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఓరుగల్లు గడ్డ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యర్థులకు తన బలం, బలగాన్ని చూపించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు. ఇక సభ ఏర్పాట్లన్నీ ఓ ఎత్తైతే… గులాబీ దళపతి స్పీచ్ మరో ఎత్తనే చెప్పాలి. స్టేజి మీదకు వచ్చినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. దాదాపు గంటసేపు ఆయన ప్రసంగం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, రాష్ట్రంలో దొరలపాలన, కాంగ్రెస్ పరిపాలిస్తున్న తీరును కేసీఆర్ ఎండగట్టాడు.