Asianet News TeluguAsianet News Telugu

చైనా యాప్ లకు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ యాప్స్ ..షేర్ చాట్, చింగారీలకు డౌన్ లోడ్స్ సునామీ

చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.

Sharechat rides on the ban on China apps with 15 million downloads in 36 hours
Author
Hyderabad, First Published Jul 2, 2020, 12:29 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్​లపై నిషేధం విధించడంతో వాటి వినియోగదారులు స్వదేశీ యాప్​లవైపు మళ్లుతున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి దేశీయ యాప్​ల డౌన్​లోడ్స్, సైనప్స్​ భారీగా పెరిగాయి.

గత రెండు రోజుల్లో తమ యాప్​ డౌన్​లోడ్స్​లో ఊహించని వృద్ధి నమోదైనట్లు దేశీయ అతిపెద్ద ప్రాంతీయ భాషా సోషల్ మీడియా వేదిక ‘షేర్​చాట్’​ వెల్లడించింది. చైనా యాప్​లపై నిషేధం విధించినప్పటి నుంచి గంటకు 5 లక్షల మేర డౌన్​లోడ్స్​ అయ్యాయని, రెండు రోజుల్లో మొత్తం 1.5 కోట్ల మంది వినియోగదారులు పెరిగారని తెలిపింది.

‘షేర్​చాట్​కు ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ఆదరణ భారతీయ సోషల్ మీడియా వేదికల్లో మేం అగ్రగామిగా నిలిచేలా చేస్తుంది. ఇది షేర్​చాట్​కు మరో విజయానికి పునాది వేస్తుందనే నమ్మకం ఉంది’ అని షేర్​చాట్​ సీఓఓ, సహ వ్యవస్థాపకుడు ఫరీద్​ అహ్సాన్ చెప్పారు. 

చైనా యాప్​లను నిషేధించటంపై ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా పోస్టులు వచ్చాయని, వాటిని 10 లక్షల మందికి పైగా వినియోగదారులు లైక్​ చేసినట్లు సంస్థ తెలిపింది. అందులో 5 లక్షలు వాట్సాప్​లోకి షేర్​ చేసినట్లు వెల్లడించింది. 

also read  ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ లలో టిక్‌టాక్ స్టార్ల హల్ చల్.. ...

టిక్​టాక్​ వినియోగదారులు, అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నవారు.. నిషేధం తర్వాత తమ యాప్​ను ఎంచుకుంటున్నట్లు షార్ట్​ వీడియో యాప్​ రొపొసొ తెలిపింది. టిక్​టాక్​లో 9.5, 9 మిలియన్​ ఫాలోవర్స్​ ఉన్న ప్రేమ్​ వాట్స్​, నూర్​ అఫ్సాన్​ వంటి వారు తమ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారని ప్రకటించింది.

రొపొసొ.. 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండగా.. 1.4 కోట్ల మంది యూజర్లు​ ఉన్నారు. నెలకు 8 కోట్ల వీడియోలు పోస్ట్​ అవుతున్నాయి. చైనా యాప్​లపై నిషేధం విధించిన 24 గంటల్లోనే 10 రెట్ల వృద్ధితో లక్షకుపైగా వినియోగదారులు పెరిగినట్లు బాక్స్​ఎంగేజ్​.కామ్​ తెలిపింది. 

లాక్​డౌన్​ విధించినప్పుడే బాక్స్ ఎంగేజ్ డాట్ కామ్ అనే బ్​సైట్​ను ప్రారంభించారు. సమాచార గోప్యత సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతం వెబ్​సైట్​ను నడుపుతుండగా.. త్వరలోనే మొబైల్​ యాప్​ను తేనున్నట్లు ఈ సంస్థ పేర్కొన్నది.

టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు ఆదరణ భారీగా పెరిగింది. 10 రోజుల్లో 5,50,000 డౌన్​లోడ్స్​ కాగా, మొత్తం డౌన్​లోడ్స్​ 20,50,000లకు చేరాయి.

Follow Us:
Download App:
  • android
  • ios