MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Technology
  • Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI

Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI

Aadhaar: యాప్స్‌ మారే పనిలేకుండా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాప్‌లలోనే ఆధార్‌ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేసే కొత్త ఫీచర్లని యూఐడీఏఐ లాంచ్ చేసింది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 10 2026, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మరింత ఈజీగా ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్
Image Credit : Asianet News

మరింత ఈజీగా ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్

ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా కేవైసీ తప్పనిసరి. అయితే, ఇప్పటి వరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ కోసం ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మారాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ తిప్పలు ఉండవు. ఆధార్ జారీ చేసే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ ప్రక్రియను మరింత ఈజీ చేస్తూ కొత్త ఫేస్ ఆథెంటికేషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో యూఏడీఏఐ రెండు కీలకమైన టూల్స్‌ను ఆవిష్కరించింది. అందులో ఒకటి 'ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ SDK' కాగా, రెండోది 'ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ శాండ్‌బాక్స్'. ఈ కొత్త టూల్స్ ద్వారా బ్యాంకులు, ఇన్సూరెన్స్, బ్రోకింగ్, ఫిన్‌టెక్ సంస్థలు తమ సొంత మొబైల్ యాప్‌లలోనే ఫేస్ వెరిఫికేషన్ నేరుగా చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాత పద్ధతికి బై బై.. యాప్‌లు మారే పనిలేదు
Image Credit : Chatgpt

పాత పద్ధతికి బై బై.. యాప్‌లు మారే పనిలేదు

ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న విధానంలో ఫేస్ వెరిఫికేషన్ కోసం వినియోగదారులు FaceRD అనే ప్రత్యేకమైన యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ప్రతిసారి ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కి స్విచ్ అవ్వాల్సి వచ్చేది. ఇది వినియోగదారులకు కాస్త విసుగు తెప్పించే విషయం.

అయితే, కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్, iOS సపోర్టు ఇచ్చే SDK సిస్టమ్ ద్వారా యూజర్లు తాము ఉపయోగిస్తున్న బ్యాంకింగ్ లేదా ఇన్సూరెన్స్ యాప్‌లోనే ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల సింగిల్ యాప్ అనుభూతి లభిస్తుంది. డిజిటల్ కేవైసీతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా వేగంగా పూర్తవుతుంది.

Related Articles

Related image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Related image2
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
34
టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా శాండ్‌బాక్స్
Image Credit : Asianet News

టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా శాండ్‌బాక్స్

సరికొత్త సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందే వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు యూఐడీఏఐ ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ శాండ్‌బాక్స్'ను కూడా ప్రారంభించింది. ఇది సురక్షితమైన ప్రయోగశాల లాంటిది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ కస్టమర్లకు సేవలు అందించడానికి ముందే ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆయా ఫీచర్లను టెస్ట్ చేసుకోవచ్చు.

ఈ శాండ్‌బాక్స్ ద్వారా ఫేస్ క్యాప్చర్, యూజర్ సమ్మతి, వెరిఫికేషన్, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి అంశాలను పరిశీలించవచ్చు. విశేషమేమిటంటే, దీని కోసం ఎలాంటి ఓపెన్ బయోమెట్రిక్ హార్డ్‌వేర్ అవసరం లేదు. నెట్‌వర్క్ సమస్యలు, టైమ్‌అవుట్, డిజిటల్ సిగ్నేచర్ ఫెయిల్యూర్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ముందే చెక్ చేసుకోవచ్చు.

44
అధునాతన భద్రత.. ఏఐ సాంకేతికత
Image Credit : Getty

అధునాతన భద్రత.. ఏఐ సాంకేతికత

ఈ కొత్త SDK టూల్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్‌నెస్, యాంటీ-స్పూఫింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి నకిలీ ఫోటోలు లేదా వీడియోల ద్వారా జరిగే మోసాలను అడ్డుకుంటాయి.

డేటా సురక్షితంగా రవాణా అయ్యేందుకు ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ కూడా ఉంది. అన్ని రకాల కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది సజావుగా పనిచేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ శాఖలు, బ్యాంకింగ్ రంగం, ఇతర సంస్థలు తమ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించే వీలు కలుగుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ మ‌నుషుల్ని అంతం చేయ‌నుందా.? ప్రపంచాన్ని భ‌య‌పెడుతోన్న అత‌ని రాజీనామా
Recommended image2
Iphone 18: ఐఫోన్ 18 కొనాలని అనుకుంటున్నారా? ఈ దేశం లో కొంటే తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది..!
Recommended image3
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Related Stories
Recommended image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Recommended image2
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved