Asianet News TeluguAsianet News Telugu

40వేల మందిలో ఆడటం అంత సులువు కాదు...: విండీస్ కోచ్

భారత్- వెస్టిండిస్ ల మధ్య వన్డే సీరిస్ అద్భుతంగా సాగిందని విండీస్ జట్టు కోచ్ స్టువర్ట్ లా వెల్లడించారు. తమ జట్టు అత్యుత్తమమైన, బలమైన భారత జట్టుకు పోటీ ఇచ్చి బరిలో నిలవడం చాలా గొప్పవిషయమని అన్నారు. మొదటి మూడ వన్డేల్లో విండీస్ ఆటగాళ్ళు భారత్ కు కాస్త దీటుగానే జవాబిచ్చి ఎదురునిలిచారని స్టువర్ట్ ప్రశంసించారు. 

windies coach stuart law responded about odi series
Author
New Delhi, First Published Nov 2, 2018, 8:00 PM IST

భారత్- వెస్టిండిస్ ల మధ్య వన్డే సీరిస్ అద్భుతంగా సాగిందని విండీస్ జట్టు కోచ్ స్టువర్ట్ లా వెల్లడించారు. తమ జట్టు అత్యుత్తమమైన, బలమైన భారత జట్టుకు పోటీ ఇచ్చి బరిలో నిలవడం చాలా గొప్పవిషయమని అన్నారు. మొదటి మూడ వన్డేల్లో విండీస్ ఆటగాళ్ళు భారత్ కు కాస్త దీటుగానే జవాబిచ్చి ఎదురునిలిచారని స్టువర్ట్ ప్రశంసించారు. 

అయితే నాలుగు, ఐదో వన్డేలో విండీస్ జట్టు భారత ఆటగాళ్ల జోరును అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. మొదటి మూడు వన్డేల్లోనే తమ జట్టు ఆటగాళ్లలో పెట్రోల్ అయిపోవడం వల్లే మిగతా రెండింట్లో జోరు తగ్గిందని స్టువర్ట్ కాస్త చమత్కారంగా మాట్లాడారు. 

ఇక భారత్ వంటి ఉపఖండంలో ఎలా ఆడాలో ఈ సీరిస్ ద్వారా విండీస్ ఆటగాళ్లు నేర్చుకున్నారని అన్నారు. 40 వేల మంది అభిమానుల మధ్యలో ఆడటం అంత సులువైన విసయం కాదని అన్నారు. అలాంటి పరిస్థితులకు తమ ఆటగాళ్లు అలవాటుపడాల్సిన అవసరం ఉందని స్టువర్ట్ సూచించారు.

క్రికెట్లోబ కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని...సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే తెలివి ఉండాలన్నారు. వన్డే సీరిస్ లో చివరి రెండు వన్డేల్లో తమ జట్టు ఓడిపోడానికి ఆటగాళ్ల అనుభవలేమి కారణమని భావిస్తున్నట్లు పేర్కోన్నారు.  ఏదేమైనా భారత్ వంటి నంబర్ వన్ జట్టుతో తలపడి నెగ్గడం అంత సులువైన విషయం కాదని స్టువర్టు లా ఒప్పుకున్నారు. 

మరిన్ని వార్తలు

ఐసిసి ర్యాంకింగ్స్...టాప్ టెన్‌లో ఆరుగురూ భారత ఆటగాళ్లే

కోహ్లీ సరసన రోహిత్... 2018లో మొదటి రెండు స్థానాలు కెప్టెన్, వైస్ కెప్టెన్లవే

 త్రివేండ్రం వన్డే: విండీస్ చిత్తు...వన్డే సీరిస్ భారత్ వశం

ముంబై వన్డే: అతిగా ప్రవర్తించిన భారత బౌలర్‌కు మందలింపుతో పాటు....

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

Follow Us:
Download App:
  • android
  • ios