MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • India vs England : మిస్టరీ స్పిన్నర్‌ ఔట్.. సీనియర్ రీఎంట్రీ : సెమీస్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

India vs England : మిస్టరీ స్పిన్నర్‌ ఔట్.. సీనియర్ రీఎంట్రీ : సెమీస్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

T20 World Cup 2026 : ఇవాళ ఇంగ్లండ్‌తో జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 05 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ పోరు
Image Credit : Getty

ఇండియా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ పోరు

టీ20 వరల్డ్ కప్ 2026 విజయానికి కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది టీమిండియా. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 5, గురువారం) ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ లో తలపడనుంది. సూపర్-8 లో భయంకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన  వెస్టిండిస్ ను చిత్తుచేసిన సూర్య సేన రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ కు చేరింది. ఈ వరల్డ్ కప్ లో మొదటిసారి ఇంగ్లాండ్ తో తలపడుతోంది. 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే వాంఖడే పిచ్, ముంబై పరిస్థితులకు అనుకూలంగా టీమిండియాలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించి సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరుణ్ బౌలింగ్ అంత గొప్పగా లేదు
Image Credit : AFP

వరుణ్ బౌలింగ్ అంత గొప్పగా లేదు

ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 12 వికెట్లు తీసి టాప్ బౌలర్ల జాబితాలో నిలిచాడు. అయితే సూపర్-8 తొలి భారత్ తలపడ్డ మొదటి మ్యాచ్ లో వరుణ్ భారీగా సమర్పించుకున్నాడు… పలితంగా సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక జింబాబ్వేపైనా అతని బౌలింగ్ అంత గొప్పగా లేదు. 

ఇదే సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు 'మిస్టరీ స్పిన్' కంటే సాధారణ స్పిన్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారు. అందుకే కుల్దీప్‌ను తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

35
వరుణ్ స్థానంలో కుల్దీప్
Image Credit : AFP

వరుణ్ స్థానంలో కుల్దీప్

ముంబై వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలించినా, గత కొన్ని మ్యాచ్‌లుగా బంతి కాస్త ఆగి టర్న్ అవుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లపై కుల్దీప్ యాదవ్ 'రిస్ట్ స్పిన్'కు మంచి రికార్డు ఉంది. అందుకే వరుణ్ స్థానంలో కుల్దీప్‌కు చోటు దక్కొచ్చు. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడగ్గా.. 'అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్, వరుణ్‌లలో ఎవరిని ఆడించాలనేది ఒక స్వీట్ హెడేక్' అని సమాధానమిచ్చాడు.
45
అభిషేక్ శర్మ కూడా ఔటేనా?
Image Credit : ANI

అభిషేక్ శర్మ కూడా ఔటేనా?

ఒకవేళ మ్యాచ్‌కు ముందు పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తే, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలా జరిగితే అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ టోర్నీలో 3 సార్లు డకౌట్ అయిన అతను, మొత్తం మీద 80 పరుగులు కూడా చేయలేదు. దీంతో అతన్ని తుది జట్టులో ఉంచుతారా లేదా అనేది అనుమానంగానే ఉంది.

55
భారత తుది జట్టు ఇదే..
Image Credit : ANI

భారత తుది జట్టు ఇదే..

ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు భారత తుది జట్టు (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ/రింకూ సింగ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
Recommended image2
T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved