భారత్-వెస్టింబిస్ జట్ల మధ్య ముంబైలో జరిగిన నాలుగో వన్డేలో టీంఇండియా ఘన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో భారత జట్టు సమిష్టి కృషి ఉంది. మొదట బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేయగా ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ లు విజృంభించారు. అయితే ఈ మ్యాచ్ లో నయా బౌలర్ ఖలీల్ అహ్మద్ అతిగా  ప్రవర్తించాడని భావించిన ఐసిసి...మ్యాచ్ రిపరీకి వివరణ ఇవ్వాల్సిందిగా  ఖలీల్ ను ఆదేశించింది. 

నాలుగో వన్డేలో భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విండీస్ టపటపా వికెట్లు కోల్పోయింది. ఇలా వికెట్లు పడగొడుతున్న ఆనందంలో నయా ఫేసర్ ఖలీల్ అహ్మద్ రెచ్చిపోయాడు. కాస్త కుదురుకున్నట్లు కనిపించిన విండీస్ బ్యాట్‌మన్ మార్లోన్ శామ్యూల్స్‌ను ఔట్ చేసిన తర్వాత అతడివైపు చూస్తూ పలుమార్లు గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇలా ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టేలా ప్రవర్తించి ఖలీల్ నిబంధనలను ఉళ్లంగించాడని ఐసిసి ఆరోపించింది. 

ఈ  ఘటనపై మ్యాచ్ రిపరీ క్రిస్ బ్రాడ్ కు వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో అతడి ముందు హాజరైన ఖలీల్ తన తప్పుును ఒప్పుకున్నాడు. దీంతో అతడిని మందలించిన రిపరీ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ వేశారు. 

మరిన్ని వార్తలు

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్