నిర్ణయాత్మక ఐదో వన్డేలో భారత్ విండీస్ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఐదు వన్డేల సీరిస్ 3-1 తేడాతో భారత్ వశమైంది. 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే విండీస్ బౌలర్లు షాకిచ్చారు. రెండో ఓవర్లోనే ధావన్ వికెట్ పడగొట్టారు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండానే భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో రోహిత్ అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. మొత్తానికి రోహిాత్ 63 పరుగులు 56 బంతుల్లో( 5 పోర్లు, 4 సిక్సులు) సాధించగా, కోహ్లీ 33 పరుగులు 29 బంతుల్లో( 6 ఫోర్లు) బాదాడు. వీరి దూకుడుతో కేవలం 14.5 ఓవర్లలోనే ఆట ముగిసింది.  

తిరువనంతపురంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ ఘన విజయం వైపు దూసుకుపోతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించి ఇండియా విజయాన్ని ఖరారు చేశారు.  కెప్టెన్ కోహ్లీతో కలిసి మరో వికెట్ పడకుండా రోహిత్ మంచి బాగాస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ కేవలం 54 బంతుల్లోనే 62 పరుగులు సాధించగా కోహ్లీ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

కేవలం 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కూడా  ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్  రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. థామన్ బౌలింగ్ క్లీస్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 3 ఓవర్లలో 22 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 

తిరువనంతపురంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో విండీస్ కేవలం 31.5 ఓవర్లలోనే 104 పరుగులు చేసి ఔటయ్యింది. విండీస్ జట్టుకు ఏ దశలోనూ కోలుకోడానికి సమయం  ఇవ్వకుండా  బౌలర్లు వికెట్లు పడగొట్టారు. విండీస్ జట్టులో ముగ్గురు బ్యాట్ మెన్స్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. 25 పరుగులు చేసిన హోల్డర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఖలీల్ అహ్మద్, బుమ్రాలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా,భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ లు చేరో వికెట్ తీశారు. దీంతో భారత జట్టు ముందు విండీస్ కేవలం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 

ఐదో వన్డేలో భారత బౌలర్ల జోరు కొనసాగుతోంది. విండీస్ జట్టును కుప్పకూల్చడంలో దాదాపు వారు సఫలమయ్యారు. ఇప్పటికే ఏడు  వికెట్లు కోల్పోయి ఫీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ కు కుల్దీప్ మరో షాకిచ్చాడు. కుల్దీప్ వేసిన 28 ఓవర్లో పాల్ ఫీల్డర్ రాయుడికి క్యాచ్ ఇచ్చి  ఔటయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద విండీస్ 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులు బిషూ, రోచ్ లు వున్నారు. 

విండీస్ జట్టు వికెట్ల పతనాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన బ్యాట్ మెన్ హోల్డర్ కూడా  పెవిలియన్ కు చేరాడు. ఇప్పటివరకు 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన హోల్డర్, ఖలీల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో విండీస్ 87 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పాల్, బిషూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.  

విండీస్ మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 20వ ఓవర్లో అలెన్(4 పరుగులు) జాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో విండీస్ 66 పరుగుల  వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం హోల్డర్ కి తోడుగా పాల్ క్రీజులో వున్నాడు. 

ఐదో వన్డేలో భారత బాలర్ల దాటికి విండీస్ బ్యాట్ మెన్స్ పెవిలియన్ బాట పట్టారు. కేవలం 57 పరుగులకే విండీస్ జట్టు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఖలీల్ అహ్మద్ వేసిన 16 ఓవర్లో ఓపెనర్ ఆర్. పావెల్ ఔటయ్యాడు. ప్రస్తుతం హోల్డర్, అలెన్ బ్యాటింగ్ చేస్తున్నారు.  విండీస్ స్కోరు ప్రస్తుతం 20 ఓవర్లలో 65 పరుగులుగా ఉంది. 

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలోనే విండీస్ బ్యాటింగ్ పేలవంగా సాగుతోంది. భారత బౌలర్ల దాటికి మరోసారి విండీస్ బ్యాట్ మెన్స్  అల్లాడిపోతున్నారు. కేవలం 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. 

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఈ సీరీస్ లో మొదటిసారిగా విండీస్ టాస్ గెలించింది. దీంతో విండీస్ జట్టు బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఇది తప్పుడు నిర్ణయమని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. 

మొదటి ఓవర్లోనే బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓపెనర్ పావెల్ డకౌట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బుమ్రా ఈ సీరిస్ లో మంచి పామ్ లో వున్న హోప్స్ ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్యామూల్స్ జట్టును ఆదుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు జడేజా వేసిన 11 ఓవర్లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక 15 ఓవర్లో హెట్మెయర్ రూపంలో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా జడేజా ఖాతాలోకే చేరింది. 

ప్రస్తుతం క్రీజులో ఆర్. పావెల్, హోల్డర్ ఉన్నారు. మొత్తంగా విండీస్ జట్టు కేవలం 16 ఓవర్లలో 57 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో జడేజా  2, భువనేశ్వర్ 1, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.