ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ముంబైలో జరుగుతున్న వన్డేలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తరపున ఓపెనర్ శిఖర్ ధావన్ బరిలోకి దిగాడు. అయితే అతడిని 12 ఓవర్లోనే విండీస్ బౌలర్ కీమో పాల్ ఔట్ చేశాడు. ఈ సందర్భంగా కీమో ధావన్ ను ఔట్ చేసిన ఆనందంలో అతడి స్టైల్లోనే సంబరాలు చేసుకున్నాడు. 

శిఖర్ ధావన్ మంచి బ్యాట్ మెన్ గానే కాకుండా మంచి ఫీల్డర్ గా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే తన తోటి క్రీడాకారులతోనే కాదు ప్రత్యర్థి ఆటగాళ్లతో కూడా సరదాగా ఉండటం అతడికి అలవాటు. అంతే కాకుండా స్టేడియంలో కూడా అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగా పలు సందర్భాల్లో క్యాచ్ పట్టిన ఆనందంలో తొడగొట్టి మీసాలు మెలేసి సంబరాలు చేసుకోవడం మనందరం చూశాం. ఇలా కబడ్డీ స్టైల్లో సంబరాలు చేసుకోవడం ధావన్ అలవాటుగా మార్చుకున్నాడు.

అయితే  ఇవాళ జరుగుతున్న నాలుగో వన్డేలో ధావన్ 38 పరుగుల వద్ద కీమో పాల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  ధావన్ క్యాచ్ ని ఫీల్డర్ పట్టుకోగానే పాల్ అతిగా సంబరాలు చేసుకున్నాడు. ధావన్ ను వెక్కిరిస్తున్నట్లుగా పాల్ తొడ గొట్టాడు. పాల్ చర్యలతో భారత అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.