ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన తొలి మూడు వన్డేల్లోనూ సెంచరీలతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తగా తాజాగా పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. కోహ్లీని ఆకాశానికెత్తేశాడు.

గువాహటి, విశాఖపట్టణం, పుణె.. మూడు వన్డేల్లోనూ సెంచరీలు చేసిన కోహ్లీ ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడని ప్రశంసించాడు. కోహ్లీ కొంచెం ‘స్పెషల్’ అని ఆకాశానికెత్తేశాడు. అతడో గొప్ప పరుగుల యంత్రమని కొనియాడాడు.

అతడి కోసం 120 సెంచరీల టార్గెట్‌ను సెట్ చేశానని, కోహ్లీ దానిని కూడా క్రాస్ చేస్తాడని షోయబ్ జోస్యం చెప్పాడు. కాగా, కోహ్లీ 120 అంతర్జాతీయ సెంచరీలు చేస్తాడని షోయబ్ గతేడాదే జోస్యం  చెప్పాడు. ఇప్పుడు దానిని నిజం చేస్తూ టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెస్ స్పీడుతో దూసుకెళ్తున్నాడు. కోహ్లీ ఇలాగే చెలరేగితే అక్తర్ సెట్ చేసిన టార్గెట్‌ని ఛేదించడం పెద్ద కష్టమేమి కాదు.

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

కోహ్లీ సెంచరీ వృధా: విండీస్ విజయం, సిరీస్ సమం

విశాఖలో జగన్ పై దాడి.. ఇబ్బందిపడ్డ కోహ్లీ సేన

టీ20 నుంచి ధోనీకి ఉద్వాసన: విండీస్ తో సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్

జోరువానలోనూ అపైరింగ్...ఆటగాళ్లు మైదానం వీడినా తడుస్తూనే....

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ