భారత్-వెస్టిండిస్‌ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టు 377 పరుగులు సాధించింది. భారత బ్యాట్ మెన్స్ అద్భుతంగా ఆడి విండీస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు.  భారత జట్టు ఇంత భారీ  స్కోరు సాధించడానికి పునాది వేసింది ఓపెనర్ రోహిత్ శర్మ. ఇతడు మొదట్లో ఆచి తూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతూ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రెండూ సచిన్ టెండూల్కర్‌వే కావడం విశేషం.

ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ ఓ వైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా భారత ఇన్నింగ్స్ ను నిలబెడుతూ సెంచరీ సాధించాడు. దీంతో తన కెరీర్లో 21వ సెంచరీ  పూర్తిచేసుకున్నాడు. అయితే ఓపెనర్ గా రోహిత్ కు ఇది 19 వ సెంచరీ. కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఓపెనర్ గా సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్సుల్లో సెంచరీ సాధించాడు. అతడి కంటే వేగంగా 19 సెంచరీలు సాధించి రోహిత్ ఆ రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 19 సెంచరీలు సాధించిన భారత బ్యాట్ మెన్ గా రోహిత్ నిలిచాడు. 

అయితే ఇలా ఓపెనర్ గా వేగంగా అత్యధిక సెంచరీలు సాధించిన ఘనత మాత్రం దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు 102 ఇన్నింగ్సుల్లోనే 19 సెంచరీలు పూర్తిచేసుకున్నాడు.అతడి తర్వాత  రెండో స్థానంలో రోహిత్ నలిచాడు.

ఇక సిక్సర్ల  విషయంలోనూ రోహిత్ మరో రికార్డు సాధించాడు. వన్డేల్లో సచిన్‌ పేరిట వున్న 195 సిక్సర్ల రికార్డును రోహిత్ అదిగమించాడు. ఈ మ్యాచ్ కు ముందు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచిన రోహిత్ ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది సచిర్ రికార్డును బద్దలుగొట్టాడు. మొత్తంగా భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్ మెన్స్ జాబితాలో ఎంఎస్ ధోని(211 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా రోహిత్ 198 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

మరిన్ని వార్తలు

ముంబై వన్డే: విండీస్ ముందు 378 పరుగుల భారీ విజయలక్ష్యం

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

కోహ్లీ సెంచరీ వృధా: విండీస్ విజయం, సిరీస్ సమం

విశాఖలో జగన్ పై దాడి.. ఇబ్బందిపడ్డ కోహ్లీ సేన

టీ20 నుంచి ధోనీకి ఉద్వాసన: విండీస్ తో సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్

జోరువానలోనూ అపైరింగ్...ఆటగాళ్లు మైదానం వీడినా తడుస్తూనే....

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ