Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ర్యాంకింగ్స్...టాప్ టెన్‌లో ఆరుగురూ భారత ఆటగాళ్లే

వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సీరిస్ లో భారత్ 3-1 తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీరిస్ లో బ్యాట్ మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్ కు అద్భుత విజయాలు అందించారు. మొదటి మూడు వన్డేల్లో విండీస్ భారత్ కాస్త పోటీ ఇచ్చినప్పటికి మిగతా రెండిట్లో టీంఇండియా ముందు అసలు నిలవలేకపోయింది. ఇలా రెట్టించిన ఉత్సాహంతో సీరిస్ ముగించిన ఆటగాళ్లు అదే ఊపును ఐసీసీ ర్యాకింగ్స్ లోనూ కొనసాగించారు. 

icc ranking list
Author
New Delhi, First Published Nov 2, 2018, 5:37 PM IST

వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సీరిస్ లో భారత్ 3-1 తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీరిస్ లో బ్యాట్ మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్ కు అద్భుత విజయాలు అందించారు. మొదటి మూడు వన్డేల్లో విండీస్ భారత్ కాస్త పోటీ ఇచ్చినప్పటికి మిగతా రెండిట్లో టీంఇండియా ముందు అసలు నిలవలేకపోయింది. ఇలా రెట్టించిన ఉత్సాహంతో సీరిస్ ముగించిన ఆటగాళ్లు అదే ఊపును ఐసీసీ ర్యాకింగ్స్ లోనూ కొనసాగించారు. 

భారత్-విండీస్... శ్రీలంక-ఇంగ్లాండ్... బంగ్లాదేశ్-జింబాబ్వేల మధ్య సిరీస్‌లు ముగియడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకంగా ఐదుగురు భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్నారు.

ఈ వన్డే సీరిస్ కు ముందు కూడా బ్యాట్ మెన్స్ ర్యాకింగ్స్ లో విరాట్ కోహ్లీ మొదటిస్థానంలో కొనసాగాడు. అయితే ఈ సీరిస్ ద్వారా అతడు మరో 15 పాయింట్లు సాధించి తనకు ర్యాకింగ్స్ ను పదిలం చేసుకున్నాడు. ఇక టీంఇండియా వైస్ కెప్టెన్ గా  రోహిత్ శర్మ జట్టులో రెండో స్థానాన్ని ఆక్రమించినట్లే ఐసిసి ర్యాకింగ్స్ లో కూడా కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ సీరిస్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న రోహిత్ ఏకంగా 29పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 871 పాయింట్లు ఉన్నాయి. 

ఇక బౌలింగ్ విషయానికి వస్తే భారత యువకెరటం జస్ప్రీత్ సింగ్ బుమ్రా 841 పాయింట్లతో అంతర్జాతీయ బౌలర్లలో అగ్రస్థానం సంపాదించాడు. ఇక విండీస్ తో జరిగిన సీరిస్ లో రాణించిన చాహల్ 683 పాయింట్లు సాధించి మొదటిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇతడు 8వ స్థానంలో ఉన్నాడు. 

ఇక ఆలౌ రౌండర్ల జాబితాలో రవింద్ర జడేజా 400 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  ఈ సీరిస్ లో జడేజా బ్యాటింగ్ కంటే బౌలింగ్ లోనే ఎక్కువగా రాణించాడు. ఇక స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్  341 పాయింట్లతో ఆల్ రౌండర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇలా మొత్తంగా అన్ని విభాగాల్లో కలిసి ఆరుగురు భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో నిలిచారు. 

మరిన్ని వార్తలు

కోహ్లీ సరసన రోహిత్... 2018లో మొదటి రెండు స్థానాలు కెప్టెన్, వైస్ కెప్టెన్లవే

 త్రివేండ్రం వన్డే: విండీస్ చిత్తు...వన్డే సీరిస్ భారత్ వశం

ముంబై వన్డే: అతిగా ప్రవర్తించిన భారత బౌలర్‌కు మందలింపుతో పాటు....

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

Follow Us:
Download App:
  • android
  • ios