MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే

T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే

South Africa vs New Zealand : 2026 టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సెమీ ఫైనల్ సౌతాఫ్రికా ఓడిపోవడానికి కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2026, 11:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు
Image Credit : X@ICC

న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సంచలన విజయం సాధించింది. టోర్నమెంట్ అంతటా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికాపై కివీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 173 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా ఓటమికి దారితీసిన 5 ప్రధాన అంశాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాస్ కోల్పోవడం.. మారుతున్న పరిస్థితులు
Image Credit : Getty

టాస్ కోల్పోవడం.. మారుతున్న పరిస్థితులు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిగా ఉండి, బంతి ఆగుతూ రావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే రెండో ఇన్నింగ్స్ సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మంచు ప్రభావం కూడా కివీస్ బ్యాటర్లకు కలిసి వచ్చింది. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రామ్ కూడా పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించాడు.

Related Articles

Related image1
Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ
Related image2
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
36
స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న టాప్ ఆర్డర్
Image Credit : Getty

స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న టాప్ ఆర్డర్

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ తన స్పిన్ వ్యూహంతో సౌతాఫ్రికాను దెబ్బకొట్టింది. కోల్ మెకన్చీ తన మొదటి ఓవర్లోనే క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0)లను అవుట్ చేసి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర మధ్య ఓవర్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (18), డేవిడ్ మిల్లర్ (6)లను పెవిలియన్ పంపి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీశాడు. స్పిన్నర్ల ధాటికి సౌతాఫ్రికా పవర్‌ప్లేలో 20 డాట్ బాల్స్ ఆడింది.

46
ఫిన్ అలెన్ విధ్వంసం
Image Credit : X/ICC

ఫిన్ అలెన్ విధ్వంసం

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఈ మ్యాచ్‌లో ఊహించని రీతిలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలెన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అతని ధాటికి సౌతాఫ్రికా బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. ఏ సమయంలోనూ అతనికి దూకుడును అడ్డుకోలేకపోయారు. ఇది సౌతాఫ్రికాకు విజయాన్ని దూరం చేసింది.

56
పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు
Image Credit : Getty

పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు

కీలకమైన సెమీఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్లు క్రమశిక్షణ లేని బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కగిసో రబడ, లుంగి ఎన్గిడి, మార్కో జాన్సెన్ వంటి సీనియర్ బౌలర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ జోడీని అడ్డుకోలేకపోయారు. ఫీల్డింగ్‌లో కూడా సౌతాఫ్రికా జట్టు క్యాచ్‌లను జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో సీఫెర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడం మ్యాచ్ మలుపు తిప్పింది.

66
పవర్‌ప్లేలోనే తేలిపోయిన మ్యాచ్
Image Credit : Getty

పవర్‌ప్లేలోనే తేలిపోయిన మ్యాచ్

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ పవర్‌ప్లేలోనే 84 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఇది టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 9.1 ఓవర్లలో 117 పరుగులు జోడించి సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లారు. సీఫెర్ట్ కూడా 33 బంతుల్లో 58 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు.

చివరికి మార్కో జాన్సెన్ (55 పరుగులు) చేసిన పోరాటం సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించినా, కివీస్ బ్యాటర్ల ధాటికి అది ఏమాత్రం సరిపోలేదు. న్యూజిలాండ్ ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్ లేదా ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో సౌతాఫ్రికా మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ
Recommended image2
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved