భారత జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. విండీస్ తో జరిగిన ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ ఘన విజయం సాధించడంతో రోహిత్ ముఖ్య పాత్ర పోషించాడు. కేవలం ఈ సీరిస్ లోనే కాకుండా ఆసియా కప్ లాంటి కీలక సీరిస్ లలో కూడా రాణించాడు. ఇలా  2018 లో జరిగిన వన్డే మ్యాచుల్లో రోహిత్ తన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి ఓ రికార్డు సృష్టించాడు. 

ఇక విండీస్ తో జరిగిన చివరి వన్డేలో కూడా రోహిత్ అర్ధశతకం సాధించాడు. దీంతో  2018 క్యాలెండర్ ఇయర్  లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ చివరి వన్డేలో 63 పరుగులు సాధించడం ద్వారా ఈ సంవత్సరంలో 1000 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్(1030) రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్‌స్టో (1025) రెండో స్థానంలో కొనసాగగా రోహిత్ అతన్ని వెనక్కినెట్టాడు.

ఇప్పటివరకు 19 మ్యాచులాడిన రోహిత్ 73.57 యావరేజ్ తో 1030 పరుగులను సాధించాడు. అతడికంటే ముందు టీంఇండియా కెప్టెన్ కోహ్లీ 1202 పరుగులను 133.55 యావరేజ్ సాధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇలా 2018 క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాళ్లే మొదటి, రెండు స్థానాల్లో నిలవడం విశేషం. 

మరిన్ని వార్తలు

 త్రివేండ్రం వన్డే: విండీస్ చిత్తు...వన్డే సీరిస్ భారత్ వశం

ముంబై వన్డే: అతిగా ప్రవర్తించిన భారత బౌలర్‌కు మందలింపుతో పాటు....

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్