Asianet News TeluguAsianet News Telugu

ఏపీ మండలి రాద్ధాంతం: తలా పాపం తిలా పిరికెడు

శాసన మండలి చరిత్రలోనే నిన్నటి దినాన్ని ఒక దుర్ధినంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం అధికార పక్షమా, ప్రతిపక్షాల అంటే అందరి పాత్ర ఇందులో ఉంది. ఏ ఒక్కరినో కేవలం ఇందులో తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శాసన మండలి గౌరవాన్ని తగ్గించడానికి నిన్న అన్ని పార్టీల నేతలు ఇతోధిక కృషి చేసారు. 

Ruckus in AP Legislative Council: whom to blame....?
Author
Amaravathi, First Published Jan 23, 2020, 2:53 PM IST

శాసన మండలి చరిత్రలోనే నిన్నటి దినాన్ని ఒక దుర్ధినంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం అధికార పక్షమా, ప్రతిపక్షాల అంటే అందరి పాత్ర ఇందులో ఉంది. ఏ ఒక్కరినో కేవలం ఇందులో తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శాసన మండలి గౌరవాన్ని తగ్గించడానికి నిన్న అన్ని పార్టీల నేతలు ఇతోధిక కృషి చేసారు. 

తొలుత బాగా వివాదాస్పదమవుతున్న చైర్మన్ గురించి మాట్లాడుకుందాము.  చైర్మన్ మీద అధికారపక్షం చేస్తున్న ప్రధాన ఆరోపణ ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు అని అంటున్నారు. వాస్తవంగా కూడా ఆయన తొలుత అసెంబ్లీ నుండి వచ్చిన బిల్లులను కాకుండా రూల్ 71 కింద చర్చకు అనుమతించడం ఒకింత వివాదాస్పదంగానే ఉంది. 

ఇలా ఉండడానికి కారణం కూడా లేకపోలేదు. శాసన మండలి అనేది ఉన్నది ప్రధానంగా  (శాసనాలను) చట్టాలను చేయడానికి . కాబట్టి తొలి ప్రాధాన్యత దానికి ఇస్తే బాగుండేది. అలా కాకుండా చర్చకు అనుమతించడం మాత్రం వివాదాస్పదమయ్యింది.

ఇక చైర్మన్ మీద ఉన్న మరో ఆరోపణ ఏమిటంటే... టీడీపీ సభ్యులు సెలెక్ట్ కమిటీ కి బిల్లును పంపమని సకాలంలో లేఖ ఇవ్వనప్పటికీ, చైర్మన్ తన ప్రత్యేక విచక్షణాధికారాలను ఉపయోగించి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారానిది అభియోగం. 

Also read: మండలి రద్దు: అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ అంతే తేడా..మిగితాదంతా సేమ్ టు సేమ్

నిన్న ప్రత్యక్ష ప్రసారం లేదు. అందరూ రాజకీయ నాయకులూ చెప్పిన మాటలను నమ్మాల్సిందే. ఒకవేళ గనుక చైర్మన్ ఇలా తన విచక్షణాధికారాలను ఉపయోగించి పంపినప్పటికీ కూడా దీన్ని కోర్టులో సవాల్ చేసినా చెల్లదు.

ఒకవేళ గనుక ఇలా సవాల్ చేస్తేనే గనుక రద్దయ్యేట్టయితే... కేంద్రం ఆధార్ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ చర్యను సుప్రీంకోర్ట్ తప్పుబట్టాల్సింది. కానీ సుప్రీమ్ కోర్ట్ అలా చేయలేదు. 

సుప్రీమ్ కోర్ట్ స్పష్టంగా ఇర్రెగులారిటీ ఉంటే ఏమి చేయలేము కానీ, అది ఇల్లీగల్ అయితే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టులో ఇలా సెలెక్ట్ కమిటీకి పంపడంపై కోర్టు కూడా ఏమి చేయలేదు. కారణం ఇది ఇర్రెగులారిటీ ఏ కానీ, చట్ట వ్యతిరేకం కాదు. 

ఇక ప్రతిపక్ష టీడీపీ విషయానికి వస్తే. నిన్న చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని టీడీపీ ముఖ్యనేతలంతా మండలి గ్యాలెరీలో కూర్చున్నారు. వైసీపీ వారు చెప్పిన విషయం ఏమిటంటే...చంద్రబాబు పదే పదే గుర్రుగా చూస్తున్నారు చైర్మన్ వైపు అని, ఆయన్ని ప్రభావితం చేసారని అంటున్నారు. 

అది పక్కకు పెట్టినా సభలో గందరగోళాన్ని సృష్టించడం, స్పీకర్ పోడియం పైకి ఎక్కడం మాత్రం భావ్యం కాదు. టీడీపీ నేతలు కూడా కొద్దిగా వారి ప్రవర్తన వల్ల సభలో గందరగోళ పరిస్థితులను సృష్టించారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. 

ఇక అధికార వైసీపీ విషయానికి వస్తే.... అంత మంది మంత్రులు నిన్న మండలి హాళ్ళలో ఒక భయానక వాతావారంనానయితే సృష్టించారు. మంత్రి బొత్స సత్యనారాయణ లోకేష్ ల మధ్య జరిగిన వాగ్యుద్ధం కానివ్వండి, మరో మంత్రి కొడాలి నాని టీడీపీ సభ్యులపైకి చేసిన దూసుకెళ్లే ప్రయత్నం కానియ్యండి. ఒక రకమైన భీతావాహ వాతావరణాన్ని సృష్టించింది. 

Also read; సీనియర్లతో జగన్ మంతనాలు: శాసనమండలి రద్దు దిశగా ప్లాన్?

మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విజయసాయి రెడ్డి ఆయన ఛాంబర్లోకి వెళ్లి కూర్చోవడం, ఇక ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మాటలు గనుక తీసుకుంటే నయితే ఏకంగా ఆయన్ను బెదిరించారని అంటున్నారు.

మతం పేరుతోపెట్టి దూషించారని అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందొ తెలీదు. కానీ నిన్న మాత్రం వైసీపీ సభ్యులు, వారి మంత్రులు మాత్రం మండలిలో భయానక వాతావరణాన్నయితే సృష్టించారు. 

నిన్నటి రోజును ఒక రకంగా బ్లాకే డే గా అభివర్ణించొచ్చేమో. అధికార ప్రతిపక్షాలు అది శాసన మండలి అనే కనీస గౌరవాన్ని కూడా మరిచి సభను అప్రతిష్టపాలు చేయడంలో ఇతోధిక కృషి చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios