సీనియర్లతో జగన్ మంతనాలు: శాసనమండలి రద్దు దిశగా ప్లాన్?

 ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా  ప్రచారం సాగుతోంది.

Ys jagan plans to oblish ap legislative council

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు,  సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవడంతో ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా  ప్రచారం సాగుతోంది.ఈ విషయమై  మంత్రులతో సీఎం జగన్ చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.

Also read:సీఐడీ కేసు:796 తెల్ల రేషన్ కార్డుదారులకు అమరావతిలో భూములు

పాలనా వికేంద్రీకరణ బిల్లు,  సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి సెలెక్ట్  కమిటీకి పంపడంతో   శాసనమండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందనే విషయమై ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

గురువారం నాడు ఉదయం సీఎం జగన్ సీనియర్ మంత్రులు, న్యాయ నిపుణులతో ఈ విషయమై చర్చించినట్టుగా  సమాచారం. శాసనమండలిలో ప్రస్తుతం టీడీపీకి బలం ఉంది.  అయితే శాసనమండలిలో వైసీపీ బలం పెంచుకోవాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. టీడీపీకి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంది.

అయితే టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య రానున్న రోజుల్లో తగ్గుతూ వైసీపీ బలం పెరిగే అవకాశం ఉంది. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో పాటు నామినేట్ చేసే అవకాశం కూడ  వైసీపికి ఉంటుంది. శాసనమండలిలో వైసీపీకి బలం పెరిగే వరకు  ప్రభుత్వం తెచ్చే బిల్లులను టీడీపీ అడ్డుకొనే అవకాశం లేకపోలేదని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

ఈ తరుణంలో  శాసనమండలిని రద్దు చేస్తే  ఎలా ఉంటుందనే విషయమై సీఎం జగన్  మంత్రులు, పార్టీ సీనియర్లు, ప్రభుత్వ సలహాదారులతో చర్చించినట్టుగా సమాచారం. పార్టీ సీనియర్లు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలతో కూడ సీఎం జగన్ చర్చించారు.

 శాసనమండలి రద్దును చేసే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. న్యాయ నిపుణులతో కూడ ఈ విషయమై సీఎం జగన్  ఈ విషయమై చర్చించారు.

శాసనమండలి రద్దు విషయానికి సంబంధించి తీర్మానం కూడ తయారు చేసిందనే ప్రచారం కూడ మూడు రోజులుగా సాగుతోంది. శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం రద్దు చేయాలని భావిస్తే  ఇవాళ కానీ, రేపు కానీ అత్యవసరంగా కేబినెటట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.ఈ కేబినెట్ సమావేశంలో  శాసనమండలిని రద్దుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios