కర్ణాటక పాఠం... మహారాష్ట్రలో ముందుగానే బీజేపీ ప్లాన్ బి సిద్ధం?
రాజకీయ విశ్లేషకులు కర్ణాటక తో మహారాష్ట్ర పరిణామాలను పోల్చడంలో బిజీగా ఉంటే, బీజేపీ అధినాయకత్వం మాత్రం కర్ణాటక డ్రామా నుండి పాఠాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నట్టు మనకు కనపడుతుంది. ఆ నేర్చుకున్న పాఠాలనే, ఇప్పుడు మహారాష్ట్రలో ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు ఎకాడ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కు తక్కువగా ఉండడం లేదు. ఇంకాసేపట్లో ముగింపు కార్డు పడుతుందనుకుంటుండగా మరో పరిణామం, ఇక సమసిపోయింది అనుకోగానే మరో ఊహించని షాక్, ఇలా సాగుతుంది మహారాష్ట్ర రాజకీయం. చాలా మంది విశ్లేషకులు కర్ణాటక డ్రామాతో, మహారాష్ట్ర రాజకీయ నాటక పరిణామాలను పోలుస్తున్నారు.
Also read: కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక
రాజకీయ విశ్లేషకులు కర్ణాటక తో మహారాష్ట్ర పరిణామాలను పోల్చడంలో బిజీగా ఉంటే, బీజేపీ అధినాయకత్వం మాత్రం కర్ణాటక డ్రామా నుండి పాఠాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నట్టు మనకు కనపడుతుంది. ఆ నేర్చుకున్న పాఠాలనే, ఇప్పుడు మహారాష్ట్రలో ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది.
కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ, చాలా ముందు జాగ్రత్తగానే ప్లాన్ బీని రచించుకుని దానిని అప్పటికే రంగంలోకి దించేసి సమయం కోసం వేచి చూసిందని కొందరు బీజేపీ నాయకుల మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చిన వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంది. బీజేపీ తొలుత శివసేన పార్టీ కలిసొస్తుందని చూసినా, శివసేన పార్టీ 50-50 ఫార్ములాతో మంకు పట్టు పట్టడంతో బీజేపీ వారిని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.
శివసేన ఇక వెనక్కు తిరిగిరానంత దూరం వెళ్ళింది అని అనుకున్నాక, చాలా పకడ్బందీగానే ప్లాన్ బీని రచించుకుందట. కర్ణాటకలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న తర్వాతే బీజేపీ ఈ ప్లాన్ బీని రచించినట్లుగా కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Also read: 'మహా ప్రభుత్వ' ఏర్పాటు కేసు: బలపరీక్షపై రేపు తేల్చనున్న సుప్రీం
దేశ ఆర్ధిక రాజధానైనా మహారాష్ట్రలో, అందునా అత్యధిక సంఖ్యలో ఎంపిలను పార్లమెంటుకు పంపుతున్న రెండవ అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇలాంటి మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారం చేజిక్కించుకోవడం బీజేపీ కి అత్యవసరం. అందునా పక్కనున్న కర్ణాటకలో ఉప ఎన్నికల వేళ. మహారాష్ట్రలో గనుక అధికారం కోల్పోయారని కనబడితే, కర్ణాటకలో కూడా అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది.
కర్ణాటకలో ఏం జరిగిందన్న విషయానికి వస్తే, మహారాష్ట్ర లాగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యలో మాత్రం సీట్లను గెలవలేకపోయింది. ఈ క్రమంలో జేడీఎస్ కాంగ్రెస్ ల నుంచి రెబెల్స్ ను లాగేయాలని చూసినా అక్కడ సుప్రీమ్ కోర్ట్ జోక్యంతో ప్రమాణస్వీకారం చేసిన యెడ్యూరప్ప రాజీనామా చేయవలిసి వచ్చింది.
అయితే యడ్డీ రాజీనామా తర్వాత కొలువుదీరిన జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును అస్థిరపరిచి మరోమారు అక్కడ సీఎంగా బీజేపీ నాయకుడిని కూర్చోబెట్టడానికి బీజేపీకి చాలా కాలమే పట్టింది (దీనికి బీజేపీ అంతర్గత కుమ్ములాటలు కూడా ఒకింత కారణమైనప్పటికీ సమయం మాత్రం పట్టింది). ఈ మొత్తం వ్యవహారంతో బీజేపీ నేర్చుకున్న పాఠాలనే ఇప్పుడు మహార్తాష్ట్రలో ఉపయోగించిందని ఊహాగానాలు వినపడుతున్నాయి.
Also read: మహారాష్ట్రలో అసలు ఎం జరుగుతుంది? శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ
కర్ణాటకలో జరిగిన విధంగానే, మహారాష్ట్రలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే అవతరించినప్పటికీ, ముఖ్యమంత్రి కుర్చీ 50-50 అంటూ శివసేన రాగం అందుకోవడంతో, బీజేపీ నేతలు పరిస్థితి చేజారిపోతుందనుకోవడంతో, శివసేన తనతో కలిసి రాకుంటే, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలనేదానిపై మల్లగుల్లాలు పది ప్లాన్ బి ని సిద్ధంచేశారట.
కాంగ్రెస్ తోని తమ పార్టీ కలవలేదు కాబట్టి, కీలకంగా మారిన ఎన్సీపీ పై బీజేపీ కన్నేసింది. కుదిరితే ఎన్సీపీని ఒప్పించి, లేకుంటే, ఎన్సీపీలో చీలిక తెచ్చయినా సరే, మహారాష్ట్ర సీఎం పీఠం తమ నుంచి దూరం కాకూడదన్న పక్కా అంచనాలతోనే బీజేపీ ముందుకు సాగిందంటున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలోనే ఈ ప్లాన్ బీ నిర్మాణం జరిగినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే శివసేన కోసం చాలాకాలం బీజేపీ ఎదురు చూసినట్టు చెబుతున్నారు. అందుకోసమే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లో శివసేనకు తమ మద్దతును ఉపసంహరించలేదని నిర్ణయించుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చామని అన్నారు.
శివసేన ఎప్పుడైతే, ఎన్సీపీ కాంగ్రెస్ లతో కలిసి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోవడంతో ఒక్కసారిగా తాము రచించిన ప్లాన్ బీని బయటకు తీసినట్టు చెబుతున్నారు.