ఆ విషయంలో అమ్మాయిలు..అబ్బాయిలతో పోటీపడుతున్నారు

First Published 25, Jan 2018, 2:14 PM IST
Watching online porn helps women explore their sexuality better
Highlights
  • పోర్న్ చూసే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది, అందరూ లైంగిక చర్యల పట్ల అనురక్తి చూపిస్తుంటారు. కానీ శృంగారం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. వాటి గురించి చర్చించడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.  దీని వల్ల చాలా మంది అమ్మాయిలకు శృంగారం గురించి పెద్దగా అవగాహన ఉండదు.దీంతో లేని పోని భయాలను పెంచుకుంటారు. కాకపోతే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిందంటున్నారు నిపుణులు.

ఇప్పటివరకు అబ్బాయిలు మాత్రమే పోర్న్ సినిమాలు చూస్తారు అని అందరూ అనుకునేవాళ్లు. అయితే.. ఇప్పుడు అమ్మాయిలు కూడా పోర్న్ సినిమాలు చూస్తున్నారట. ఈ విషయంలో అబ్బాయిలతో బాగానే పోటీపడుతున్నారట. కెనడాలోని ప్రముఖ యూనివర్శిటీ నిపుణులు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  అయితే.. పోర్న్ చూడటం తప్పేమి కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని చూడటం ద్వారా అమ్మాయిలకు దీని గురించి పూర్తి అవగాహన వస్తుందంటున్నారు. శృంగారం గురించి వారిలో ఉన్నఅపోహలు తొలగిపోతాయని.. అందుకే పోర్న్ చిత్రాలు చూడటం కూడా ఒకందుకు మంచిదని చెబుతున్నారు.

loader