సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకుల మృతి

road accident in sangareddy district
Highlights

హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లాలో భోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ వద్ద  65నంబర్ జాతీయ రహదారి  ఓ ద్విచక్రవాహనం డివైడ్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృత్చువాత పడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కొల్చారం తండాకు చెందిన కుమార్‌, వినోద్‌లు తమ గ్రామం నుండి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌ వద్ద ప్రమాదానికి గురయ్యింది. బైక్ అతివేగంతో వచ్చి డివైడర్ ను భీ కొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా..  మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలను నమోదు చేసుకుని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

loader