ప్రేమికుల దినోత్సవం రోజు ఓ యువతి తన ప్రియుడిని అత్యంత కిరాతకంగా చంపింది. ప్రియుడిని హతమార్చి అతడి శరీర భాగాలను ముక్కలు ముక్కులుగా కోసి తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఈ విధంగా వాలంటైన్స్ డే రోజున ప్రియుడి ప్రాణాలను బలితీసుకకున్న యువతి పోలీసుల విచారణలో మరిన్ని క్రూరమైన నిజాలను బైట పెట్టింది.  ఈ దారుణం  రష్యా లో చోటుచేసుకుంది. 

 ఇందుకు సబంధించిన వివరాల్లోకి  వెళితే...రష్యాకు చెందిన డ్మిటీ సింకీచ్ అనే యువకుడు, అనస్తేసియా అనే యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ జంట పిబ్రవరి 14 న వాలంటైన్స్ డే రోజున సింకీచ్ ఇంట్లో కలుసుకున్నారు. ఇక్కడ సరదాగా శృంగార ఆటలు ఆడుకుందామని బాయ్ ప్రెండ్ కి చెప్పిన అనస్తేసియాకు ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా ప్రియుడిపై దాడికి దిగింది. కిచెన్ లోని కత్తి తీసుకుని విచక్షణా రహితంగా ప్రియుడిని పొడిచి చంపింది. ఆ తర్వాత అతడి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి, ప్రియుడి మర్మంగాలను పకరిజ్ లో దాచుకుంది. అయితే రెండు రోజులుగా సింకిచ్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆశ్యర్యానికి గురయ్యాయి. అతడి శరీర బాగాలు ఇంట్లో ఎక్కడపడితే అక్కడి పడి ఉండటాన్ని చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

 

ఈ హత్యకు కారణమైన అనస్తీసియను అరెస్ట్ చేసి విచారించగా ఆమె షాకింగ్ విశయాలను బైట పెట్టింది. సింకీచ్ శరీరం నుండి కట్ చేసిన అతడి మర్మాంగాలను ఫ్రిజ్ లో ప్యాకెట్ల రూపంలో దాచినట్లు తెలిపింది. దీంతో పోలీసులు అతడి ప్రైవేట్ పార్ట్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈమె మానసిక స్థితి బాగోలేకే ఇంత కిరాతకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు.