Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ భారత పర్యటన: షెడ్యూల్ ఇదే..!

అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమ, మంగళవారాల్లో ఆయన ఢిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

US President Donald Trump India tour Schedule
Author
New Delhi, First Published Feb 23, 2020, 9:47 PM IST

అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమ, మంగళవారాల్లో ఆయన ఢిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం కేంద్రంతో పాటు యూపీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ట్రంప్ పర్యటన సాగే మార్గాల్లో కోట్లు పెట్టి మరమ్మత్తులు చేయిస్తున్నారు. రహదారులు ఆకర్షణీయంగా కనిపించేందుకు గాను రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించడంతో పాటు రోడ్లను శుభ్రం చేశారు. 

ట్రంప్ షెడ్యూల్:

ఫిబ్రవరి 24:


* ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12.15 గంటలకు సబర్మతి ఆశ్రమం సందర్శన
* 1.05 గంటలకు మోటేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం
* సాయంత్రం 3.30 గంటలకు ఆగ్రా బయల్దేరి 4.45 గంటలకు చేరకుంటారు. ఆగ్రాంలోని ప్రఖ్యాత తాజ్ మహాల్‌ను సందర్శిస్తారు.
* సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ బయలర్దేరి 7.30 గంటలకు చేరుకుని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. 

ఫిబ్రవరి 25:

* ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతారు. 
* 10.30 గంటలకు రాజ్‌ఘాట్‌ సందర్శన, జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు
* 11 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ట్రంప్, మోడీ మధ్య భేటీ
* 12.40 గంటలకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు, మీడియా సమావేశం
* రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ
* రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరుగ పయనం

Read Also:

ట్రంప్‌కేమో సీ ఫుడ్ అంటే ప్రాణం, మెలానియాకు నట్స్ దిగవు: మరి ఇండియాలో ఎలా

బాహుబలి నేనే అంటూ...: వీడియోను షేర్ చేసిన డోనాల్డ్ ట్రంప్

 

Follow Us:
Download App:
  • android
  • ios