MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ప్రియమణితో హైపర్‌ ఆది ఎఫైర్‌..? అసలు మ్యాటర్‌ బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్‌.. నిజంగా ఆశ్చర్యమే!

ప్రియమణితో హైపర్‌ ఆది ఎఫైర్‌..? అసలు మ్యాటర్‌ బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్‌.. నిజంగా ఆశ్చర్యమే!

హీరోయిన్‌ ప్రియమణి, కమెడియన్ హైపర్‌ ఆది మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. దీంతో ఏదో ఉందనే రూమర్లు వచ్చాయి. తాజాగా దీనిపై ఆది స్పందించారు. అసలు విషయం చెప్పాడు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 27 2024, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రియమణి సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఫుల్‌ బిజీగా ఉంటుంది. విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తుంది. ఆమె ఇల్లాలుగా, పవర్‌ ఫుల్‌ ఉమెన్‌ పాత్రలు, యాక్షన్‌ తరహా పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు హుందాగా కనిపిస్తూ అదరగొడుతుంది. వెబ్‌ సిరీస్‌లో, ఓటీటీ ఫిల్మ్ లు, సినిమాలు ఇలా అన్ని రకాలు ప్రాజెక్ట్ లు చేస్తూ రాణిస్తుంది. ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవల `మైదాన్‌`లో మెరిసింది. దీంతోపాటు `భామ కలాపం 2`తోనూ వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రియమణి `ఢీ`షోకి జడ్జ్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. లాస్ట్ సీజన్‌ వరకు ఆమె జడ్జ్ గా ఉన్నారు. తనదైన జడ్జ్ మెంట్‌తో ఆకట్టుకుంది. డాన్సులతో అదరగొట్టింది. జోవియల్‌గా ఉంటూ అలరించింది. హైపర్‌ ఆదితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 
 

37

`ఢీ` షోలో డాన్సర్ల పర్ఫెర్మెన్స్ మధ్యలో హైపర్‌ ఆది సమక్షంలో చిన్న చిన్నస్కిట్లు ప్రదర్శిస్తుంటారు. నవ్వులు పూయిస్తుంటారు. `ఢీ`షోకి ఈ కాన్సెప్ట్ కొత్త జోష్‌ని నింపుతుంది. దీంతోపాటు గ్లామర్‌ కూడా యాడ్‌ అవుతుంది. సీరియస్‌గానే వెళ్లకుండా ఇలా ఫన్‌ గా షోని నడిపిస్తుండటంలో మంచి రేటింగ్‌తో రన్‌ అవుతుంది. అన్ని రకాలుగా ఇది ఎంటర్‌టైన్‌ చేస్తుందని చెప్పొచ్చు.  
 

47

అయితే హైపర్‌ ఆదితో కలిసి ప్రియమణి చేసే ఫన్‌ హైలైట్‌గా నిలిచేది. ఆదిని బావ బావ అంటుంది ప్రియమణి. వయసులో ఆమెనే పెద్ద అయినా, తాను కాస్త తగ్గి అలా ఫన్‌ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆది కూడా చాలా చనువుగా ఉండేవారు, ఓ సందర్భంలో ఆది ల్యాప్‌పై కూర్చుంది ప్రియమణి. అది అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. చూడబోతుంటే ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ప్రియమణి, హైపర్‌ ఆది మధ్య ఏం నడుస్తుందని ఆరా తీసే వరకు వెళ్లింది. 
 

57

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హైపర్‌ ఆది స్పందించారు. ప్రియమణితో తమకు ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాడు. `ట్యాగ్ తెలుగు` టాక్‌ షోలో పాల్గొన్న ఆదికి ఈ ప్రశ్న ఎదురుకాగా, ఆయన ఓపెన్‌ అయ్యాడు. అసలు విషయం బయటపెట్టాడు. తమ మధ్య ఏం లేదని తేల్చేశాడు. 
 

67
Priyamani

Priyamani

ప్రియమణి ఓ జాతీయ అవార్డు గ్రహీత, సెట్‌లో ఎంత క్లోజ్‌గా, ఎంత స్పోర్టీవ్‌గా ఉంటారంటే, నన్ను బావ బావ అని పిలుస్తారు. ఎప్పుడు ఏం చేసినా అంతే స్పోర్టీవ్‌గా తీసుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతోనూ కలిసి పోతారు. డాన్సర్లతో కలిసి రీల్స్ చేస్తారు. వారిని ఎంకరేజ్‌ చేస్తారు. ఆమె ఓ స్టేజ్‌ని చూసి వచ్చారు. స్టార్‌ ఇమేజ్‌ని అనుభవించి వచ్చారు. అనుభవిస్తున్నారు. కానీ చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్‌ చేయడంలో ది బెస్ట్` అని తెలిపారు ఆది. 

77

హైపర్‌ ఆది ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`, ఢీ షోలు చేస్తున్నారు. `జబర్దస్త్` మానేసి విషయం తెలిసిందే. దీంతో ఆ లోటు జబర్దస్త్ లో కనిపిస్తుంది. ఇప్పుడు రెండు షోలతోపాటు సినిమాలు చేస్తున్నారు ఆది. మరోవైపు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన బిజీగా ఉన్నాడు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved