Asianet News TeluguAsianet News Telugu

బురారీ సామూహిక మరణాల కేసులో ట్విస్ట్

ఢిల్లీలోని బురారీలో గత జూలైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక మరణాల సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో కొత్త విషయం  వెలుగు చూసింది.

Twist in Burari mass deaths
Author
Delhi, First Published Sep 15, 2018, 2:40 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో గత జూలైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక మరణాల సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో కొత్త విషయం  వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి మానసిక శాస్త్రవేత్తల అటాప్సీ రిపోర్టు వెలుగు చూసింది. 

ఈ రిపోర్టు ప్రకారం వారంతా ఆత్మహత్య చేసుకోలేదని, అనుష్టానం చేస్తున్న సందర్భంలో ఏదో దుర్ఘటన జరిగి  మరణించి ఉంటారని తేలింది. ఢిల్లీ పోలీసులు గతంలో దీనిపై సైకలాజికల్ అటాప్సీ చేయించాలని సీబిఐని కోరారు. దీంతో సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ‌రేట‌రీ దర్యాప్తులో భాగంగా మృతులకు సంబంధించిన డెయిరీల‌ను ప‌రిశీలించింది. 

స్నేహితుల, బంధువుల వాంగ్మూలాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వారు మోక్షం కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి త‌మ‌ డెయిరీల్లో రాసుకున్న అంశాల‌ను గుర్తించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక‌రైన ల‌లిత్ చందావ‌త్‌కు చ‌నిపోయిన త‌న తండ్రి నుంచి ఆదేశాలు వ‌చ్చేవ‌ని నమ్మి అత‌ని ఆదేశాలు కుటుంబ‌స‌భ్యులు పాటించేవార‌ని తెలుస్తోంది. దీనిలో బాగంగా కుటుంబ‌స‌భ్యులు ఇంట్లో ఓ వేడుక‌ను నిర్వహించారు. 

దాని కోస‌మే వాళ్ల త‌మ చేతులు, కాళ్లను క‌ట్టుకున్నార‌ని, ముఖాన్ని వస్త్రంతో క‌ప్పేసుకున్నార‌ని సీబీఐ అధికారులు చెప్పారు. ల‌లిత్ చందావ‌త్ ఇంట్లో మొత్తం 10 మంది ఇంటి సీలింగ్‌కు ఉరి వేసుకుని మ‌ర‌ణించ‌గా, ఆయ‌న త‌ల్లి 77 ఏళ్ల నార‌య‌ణ దేవి మాత్రం ఓ గదిలో నిర్జీవంగా ప‌డి ఉన్న విషయాన్ని పోలీసులు కనుగొని దర్యాప్తు సాగించారు.

ఈ వార్తాకథనాలు చదవండి

బ్రేకింగ్ న్యూస్: ఇంట్లో ఏకంగా 11 మృతదేహాలు, ఆత్మహత్య?

ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మంది మృతి: వెలుగులోకి భయంకర వాస్తవాలు

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఎంట్రెన్స్‌లో 11 పైపులు, 11 మంది డెడ్ బాడీలు కూడ అలానే...

ఢిల్లీ డెత్స్ మిస్టరీ: 11 మందిలో ఆరుగురు ఉరితో మృతి, కళ్లు దానం

ఢిల్లీ సామూహిక మరణాలు: ఓ బాబానే కారణమా..ఆత్మహత్యల గురించి లేఖ

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఐదేళ్లుగా లలిత్ భాటియా మౌనవ్రతం, తండ్రి ఆదేశాల మేరకే ఇలా...

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఆ 11 మందిని చివరిసారిగా చూసిన ఏకైక వ్యక్తి

ఢిల్లీ డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్: ప్రియాంకకు మాంగల్యదోషం

బురారీ సామూహిక మరణాలు: విస్తుపోయే మరిన్ని విషయాలు

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఒకరి సమక్షంలో 11మంది సూసైడ్‌, ఎవరతను?

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఆ ఇంటిని ఆలయంగా మార్చండి

బురారి మరణాలు: దెయ్యాల కోసం స్మశానాల్లో దేవులాట

ఢిల్లీ మరణాల వెనక తాంత్రిక కోణం: 11 పైపులు పెట్టింది అతనే

ఢిల్లీ డెత్ మిస్టరీ: 200 మందిని విచారించిన పోలీసులు

బురారీ డెత్ మిస్టరీ.. ఉన్న ఒకే ఒక్క హోప్ కూడా పోయింది

Follow Us:
Download App:
  • android
  • ios