ఢిల్లీ డెత్ మిస్టరీ: ఆ 11 మందిని చివరిసారిగా చూసిన ఏకైక వ్యక్తి

burari deaths: this boy saw narayandevi family at saturday
Highlights

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఆ 11 మందిని చివరిసారిగా చూసిన ఏకైక వ్యక్తి 

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో వారి మరణానికి కారణం తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. వారు చాలా మంచి వారని.. అందరితో కలివిడిగా ఉంటారని... ఆర్థికసమస్యలు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో చంపేంత కక్షలు లేవని అర్థమవుతోంది.. ఇప్పుడు అందరీ చూపు ఆధ్యాత్మిక కోణం వైపే.. ఈ నేపథ్యంలో వారిని చివరిసారిగా చూసినవారిని.. మాట్లాడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు.

తాజాగా పోలీసులకు దొరికిన పత్రాల్లో చనిపోవడానికి ముందు వారు 20 రోటీలను తెప్పించుకున్నారని.. వాటిని నారాయణదేవి స్వయంగా తినిపించిందని తెలిసింది. ఈ నేపథ్యంలో రోటీలను డెలీవరి చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.. ఆ కుర్రాడి పేరు రిషి..

అతను చెప్పిన వివరాల ప్రకారం.. ‘ఆ రోజు రాత్రి 10.30 గంటల సమయంలో 20 రోటీలు కావాలంటూ ఆర్డర్ వచ్చిందని.. వారిచ్చిన చిరునామా ప్రకారం10.45 నిమిషాలకు డెలివరీ ఇచ్చానని చెప్పాడు.. ఆ సమయంలో ఇంట్లో అందరూ ప్రశాంతంగానే ఉన్నారని.. భాటియా కుమార్తె రోటీలు తీసుకుని.. నాకు డబ్బులివ్వమని తండ్రికి చెప్పిందని రిషి తెలిపాడు. దీంతో మరో ఆధారం కోసం పోలీసులు వెతుకుతున్నారు.. క్లూస్ టీం ఇవాళ మరోసారి భాటియా నివాసాన్ని సందర్శించింది.

loader