Asianet News TeluguAsianet News Telugu

బురారీ డెత్ మిస్టరీ.. ఉన్న ఒకే ఒక్క హోప్ కూడా పోయింది

 కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్‌ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్‌ డాగ్‌ గురించి తెలుసుకు సంజయ్‌ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.

Burari family's pet dog Tommy dies of cardiac arrest

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ హత్య కేసులో మిగిలిన ఒకే ఒక్క హోప్ కూడా పోయింది. గత నెలలో ఒకే కుటుంబానికి చెందిన 11మంది సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా మారి.. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి,  పెట్‌ డాగ్‌ ‘టామీ’  హార్ట్‌ అటాక్‌తో మరణించింది. నోయిడా జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ పెట్‌ డాగ్‌ మరణించినట్టు హిందూస్తాన్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. 

బురారీ కుటుంబం హత్యకు గురైనప్పుడు, ఈ పెట్‌ డాగ్‌ తీవ్ర జ్వరంతో టెర్రస్‌పై వణుకుతూ కనిపించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్‌ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్‌ డాగ్‌ గురించి తెలుసుకు సంజయ్‌ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్‌ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెట్‌ డాగ్‌ సైగల నుంచి కూడా మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేశారు.

‘ఈ డాగ్‌కు అంతకముందు నుంచే పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వారికి తెలిసి ఉండకపోవచ్చు. బురారీ ట్రాజెడీ అనంతరం ఈ డాగ్‌ను కొత్త వాతావరణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు వారి ప్రేమ, ఆప్యాయల  మధ్య జీవించిన ఈ పెట్‌ డాగ్‌, కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో దీని ఆరోగ్యం మరింత క్షీణించింది’ అని జంతు సంరక్షణ అధికారి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios