Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఆ ఇంటిని ఆలయంగా మార్చండి

న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో లలిత్ భాటియా కుటుంబసభ్యులు 11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకొన్న ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు బంధువులు ముందుకు రావడం లేదు.కేసు దర్యాప్తు నిమిత్తం ప్రస్తుతం ఈ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు.

Temple? Burari wonders what to do with ‘house of death’

న్యూఢిల్లీ:ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో లలిత్ భాటియా ఇంట్లో  11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకొన్న ఘటనకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. అయితే  ఈ ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికులు  డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆత్మహత్యలు చోటు చేసుకొన్న నేపథ్యంలో దర్యాప్తుకు అనుకూలంగా ఉండేందుకు వీలుగా పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేశారు. 

లలిత్ భాటియా కుటుంబసభ్యులు 11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకొన్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు  సీసీటీవి పుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం చేశారు. 

లిలిత్ భాటియా కుటుంబసభ్యులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్యలకు ప్రేరేపించిందేవరనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ 11 మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఇంటిని భవిష్యత్తులో ఎవరు తీసుకొంటారనే చర్చ కూడ లేకపోలేదు.

ఈ ఇంటి నిర్వహణను తీసుకొనేందుకు లలిత్ భాటియా బంధువులు ముందుకు రావడం లేదు.ఈ ఇంటి చుట్టుపక్కల నివసించేవారు కొందరు భయంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. 

 నారాయణ్‌ దేవి మరో కుమార్తె, కుమారుడు పానిపట్‌, ఛిత్తోర్‌గఢ్‌లో స్థిరపడ్డారు. దీంతో వారు ఈ ఇంటిని తీసుకోడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కూడా ఇల్లు అమ్ముడుపోవడం కష్టమనే చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఇంటిని ఆలయంగా మార్చాలనే డిమాండ్ కూడ లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios