MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Gas Saving Tips : ఇలా వండారో 50 శాతం గ్యాస్ ఆదా.. నెల వచ్చేది రెండు నెలలు వస్తుంది

Gas Saving Tips : ఇలా వండారో 50 శాతం గ్యాస్ ఆదా.. నెల వచ్చేది రెండు నెలలు వస్తుంది

మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా..? అయితే LPG గ్యాస్ ఆదా చేయడానికి సులభమైన చిట్కాలు, గ్యాస్ లేకుండానే చేసుకోగల హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 16 2026, 09:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గ్యాస్ కోసం కంగారొద్దు..
Image Credit : X

గ్యాస్ కోసం కంగారొద్దు..

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావం మన వంటగదుల మీద పడింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరతపై తెగ ప్రచారం జరుగుతోంది... ప్రభుత్వమేమో ఎలాంటి కొరత లేదంటోంది... కానీ గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రం జనం బారులు తీరుతున్నారు. కొందరు ఇండక్షన్ స్టవ్‌లు కొంటుంటే, మరికొందరు రోజంతా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్లలోనే ఉంటున్నారు. ఇలా ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా ఎక్కడో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దం జరిగితే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే ఇది కంగారు పడాల్సిన సమయం కాదు, ఆలోచించాల్సిన సమయం. మీ గ్యాస్ అయిపోవచ్చినా, అయిపోయే దశలో ఉన్నా కంగారుపడిపోకండి. గ్యాస్ ఆదా చేసే చిట్కాలతో పాటు, గ్యాస్ లేకుండానే చేసుకోగల రెసిపీల గురించి తెలుసుకొండి.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
గ్యాస్ ఆదా చేసే సులభమైన మార్గాలు
Image Credit : chat GPT

గ్యాస్ ఆదా చేసే సులభమైన మార్గాలు

గ్యాస్‌ను ఆదా చేయడం కోసం మీ కడుపు మాడ్చుకోవాల్సిన పని లేదు.. సరైన టెక్నిక్స్‌తో రుచికరమైన అహారం తింటూ కూడా ఆదా చేసుకోవచ్చు. చాలా ఇళ్లలో స్టవ్ మంటలో 40 నుంచి 60% మాత్రమే వంటకు ఉపయోగపడుతుంది... మిగిలిన వేడి వృధా అవుతుంది. సరైన పద్ధతులు పాటిస్తే గ్యాస్ వాడకాన్ని 50% వరకు తగ్గించవచ్చు.

1. నానబెట్టిన పప్పు, బియ్యం లేదా కూరగాయలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తే 50-70% గ్యాస్ ఆదా అవుతుంది.

2. పప్పు, రాజ్‌మా, బియ్యం వంటివి ముందే నానబెట్టండి.

3. మూత లేకుండా వండితే ఆవిరి బయటకు పోయి గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుంది. మూతపెట్టి వండితే 20-30% గ్యాస్ ఆదా చేయొచ్చు.

4. చిన్న గిన్నెను పెద్ద బర్నర్‌పై పెడితే మంట బయటకు వెళ్లి గ్యాస్ వేస్ట్ అవుతుంది. చిన్న గిన్నెకు చిన్న బర్నర్, పెద్ద గిన్నెకు పెద్ద బర్నర్ వాడండి. దీనివల్ల 6-10% గ్యాస్ ఆదా అవుతుంది.

5. బర్నర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.

6. వంటకు ముందే కూరగాయలు తరగడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటివి చేయండి. పొయ్యిపై వంటపాత్ర పెట్టాక ఇవన్నీ చేయడంవల్ల గ్యాస్ వృధా అవుతుంది.

7. అన్నం, కిచిడీ, ఉడికించిన కూరగాయలు ఆవిరి మీద కూడా ఉడుకుతాయి. వాటిని సగం ఉడికించి, బర్నర్ ఆపేసి ఆవిరిపై మగ్గనివ్వండి.

8. వీలైతే పప్పు, అన్నం, కూరగాయలు ఒకేసారి కుక్కర్‌లో వండండి (బ్యాచ్ కుకింగ్). దీనివల్ల LPG తక్కువ ఖర్చవుతుంది.

Related Articles

Related image1
Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!
Related image2
Induction Stove vs Gas: ఇండక్షన్ స్టవ్, గ్యాస్ సిలిండర్‌‍లో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు?
34
LPG గ్యాస్ అయిపోతే ఏం చేయాలి?
Image Credit : Getty

LPG గ్యాస్ అయిపోతే ఏం చేయాలి?

ఒకవేళ మీ దగ్గర LPG సిలిండర్ లేకపోయినా, హటాత్తుగా గ్యాస్ అయిపోయినా.. ఇండక్షన్, మైక్రోవేవ్, సోలార్ కుక్కర్ లేదా ఎలక్ట్రిక్ కెటిల్ వంటివి వాడి వంట చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ ఒక మంచి ఆప్షన్. దీనిపై వంట త్వరగా అవుతుంది... చాలా సురక్షితం కూడా. 

వేసవి కాలంలో ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం సోలార్ కుక్కర్లు కూడా వాడొచ్చు. ఈ సోలార్ కుక్కర్లలో చాలా రకాలున్నాయి. బాక్స్ సోలార్ కుక్కర్‌లో ఉడికించడం తేలిక. పారాబోలిక్ సోలార్ కుక్కర్‌లో వేయించడం, ఫ్రై చేయడం వంటివి చేయొచ్చు. కాబట్టి మీకు కావాల్సిన సోలార్ కుక్కర్ ను ఎంచుకుని ప్రస్తుత పరిస్థితుల్లో వాడుకోవచ్చు.

44
మంటతో పనిలేకుండా చేసుకునే వంటకాలు..
Image Credit : Getty

మంటతో పనిలేకుండా చేసుకునే వంటకాలు..

ఒకవేళ గ్యాస్, కరెంట్ రెండూ లేకపోయినా కొన్నిరకాల స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. వంట చేయకుండానే తినగలిగే కొన్ని పదార్థాలు ఇవే..

సత్తు పిండి : వేయించిన శనగలతో తయారయ్యే దీన్ని నేరుగా తినొచ్చు. 100 గ్రాముల సత్తు పిండిలో దాదాపు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

మరమరాలు : బజార్లో దొరికే మరమరాలలో కొంచెం మసాలా, పచ్చిమిర్చి కలిపి స్నాక్‌లా తినొచ్చు.

మొలకెత్తిన పెసలు, సలాడ్, పెరుగు అటుకులు, ఫ్రూట్ & నట్స్ బౌల్, పీనట్ బటర్ స్మూతీ వంటివి కూడా వంట చేయకుండా తినగలిగే మంచి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆప్షన్లు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
భారత దేశం
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
Recommended image2
Now Playing
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
Recommended image3
Now Playing
CM Vijay: పండిట్ అయోథిదాసర్ 181వ జయంతి నివాళ్లు అర్పించిన సీఎం విజయ్| Asianet News Telugu
Related Stories
Recommended image1
Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!
Recommended image2
Induction Stove vs Gas: ఇండక్షన్ స్టవ్, గ్యాస్ సిలిండర్‌‍లో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved