బ్రేకింగ్ న్యూస్: ఇంట్లో ఏకంగా 11 మృతదేహాలు, ఆత్మహత్య?

First Published 1, Jul 2018, 9:21 AM IST
11 Of A Family Found Dead In Delhi Home, Suicide Suspected
Highlights

ఇంట్లో ఏకంగా ఓ కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: ఇంట్లో ఏకంగా ఓ కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మృతుల్లో ఏడుగురు మహిళలు కాగా, నలుగురు పురుషులు. కుటుంబం ఫర్నీచర్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

అందరి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. శవాలు ఇంటి ఆవరణలో పైకప్పునకు వేలాడుతూ కనిపించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 

ఆత్మహత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

loader