ఢిల్లీ డెత్స్ మిస్టరీ: 11 మందిలో ఆరుగురు ఉరితో మృతి, కళ్లు దానం

Six of 11 members of Delhi family died due to hanging, says autopsy report
Highlights

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఇంట్లో శవాలై తేలిన కేసు పలు మలుపులు తిరుగుతోంది.

న్యూఢిల్లీ: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఇంట్లో శవాలై తేలిన కేసు పలు మలుపులు తిరుగుతోంది. మృతుల్లో ఆరుగురు ఉరి పడడం వల్ల మరణించినట్లు శవపరీక్షలో తేలింది. అయితే, మరణించే సమయంలో పెనుగులాడిన దాఖలాలు కూడా లేవని స్పష్టమైంది.

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గల సంత్ నగర్ లోని ఓ ఇంట్లో 11 మంది మృతదేహాలు ఇంటి పైకప్పునకు వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా, కొంత మంది ఆత్మహత్య చేసుకోగా, కొంతమందిని ఎవరైనా చంపారా అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.

కుటుంబ సభ్యులు తమ కళ్లను దానం చేశారు. తొలుత 22 మందికి చూపును ప్రదానం చేసే మృతుల కళ్లను దానం చేయాల్సి ఉందని, ఆ కుటుంబం ఇతరులకు సాయపడాలనే మతపరమైన విశ్వాసం కలిగినందున ఆ పనిచేయాల్సి ఉందని, ధ్రువీకరణ లేఖను నిన్న అందించామని కుటుంబానికి చెందిన మిత్రు నవనీత్ బాత్రా ఓ వార్తా సంస్థతో చెప్పాడు.

కుటుంబం నడిపే నడిపే దుకాణం మూసి ఉండడంతో ఆదివారంనాడు పొరుగునే ఉండే వ్యక్తి అనుమానం వ్యక్తం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు లభించిన చేతి రాతతో కూడిన నోట్స్ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే.

loader