11:50 PM (IST) Apr 07

MI vs RCB: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే విజయం.. వాంఖడేలో 10 ఏళ్ల తర్వాత

ఐపీఎల్‌ 2025లో భాగంగా వాంఖడేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ జట్టు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరికి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది. 

పూర్తి కథనం చదవండి
11:34 PM (IST) Apr 07

సౌదీలో భారతీయులకు వీసాల తాత్కాలిక నిలుపుదల! ఎందుకంటే?

సౌదీ అరేబియా హజ్ యాత్ర దగ్గరపడుతుండటంతో 14 దేశాలకు వీసాలు ఇవ్వడం తాత్కాలికంగా ఆపేసింది. ఉమ్రా, వ్యాపారం, కుటుంబ సందర్శన వీసాలకు జూన్ మధ్య వరకు బ్రేక్ వేశారు. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేయడం ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

పూర్తి కథనం చదవండి
11:07 PM (IST) Apr 07

AI: ఏఐతో స్వర్గం నుంచే వీడియో షూట్‌.. పెళ్లిళ్లలో ఏడిపించడమే నయా ట్రెండ్‌.. ఖర్చు ఎంతంటే?

artificial intelligence: అనుకోని సంఘ‌ట‌న‌ల్లో పేగుబంధం పంచిన మ‌న అమ్మానాన్న‌లు చ‌నిపోవ‌డం, ప్ర‌మాద‌వ‌శాత్తు రక్తం పంచుకుని పుట్టిన అన్న‌య్యా, త‌మ్ముడు, అక్క‌, చెల్లి దూరం అవడం. మమకారం, ఆప్యాయతలు పంచిన అమ్మమ్మ‌, నాన‌మ్మ‌, తాత‌య్య‌లు లేకపోవడం ఎంతో బాధాకరం కదా.. అయితే వీరందరూ తిరిగి ప్ర‌త్య‌క్షం అయితే.. మ‌నం త‌ట్టుకోగ‌ల‌మా..? అలాంటిది శుభకార్యం వేళ మన నుంచి దూరం అయిన వారు వచ్చి ఆశీర్వ‌దిస్తే.. ఆ క్ష‌ణం ఎవ‌రికైనా మాటలు వస్తాయా... కంట్లో నుంచి నీరు తప్పా.. ఇలాంటి దృశ్యాలను ఏఐతో సాధ్యం చేస్తున్నారు నేటి ఫొటో గ్రాఫర్లు. ఏఐ వినియోగించి చనిపోయిన వారందరినీ వీడియో రూపంలో తీసుకొచ్చేస్తున్నారు. అసలు దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసుకుందామా మరి? 

పూర్తి కథనం చదవండి
11:03 PM (IST) Apr 07

Viral Video: కీపర్‌ వెళ్లి బౌండరీ దగ్గర క్యాచ్‌ పట్టడం ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ వీడియో

ఐపీఎల్ అంటేనే ఎప్పుడు, ఏం జరుగుతుందో, ఎవరూ ఊహించలేరు. అద్భుతమైన బ్యాటింగ్‌, బుల్లెట్లా దూసుకొచ్చిన బంతులతో పాటు అదిరిపోయే క్యాచ్‌లు ప్రేక్షకులను ఎగ్జైట్‌మెంట్‌కు గురి చేస్తాయి. మ్యాచ్‌లో జరిగే ఇలాంటి సంఘటనల కోసం క్రికెట్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. 

పూర్తి కథనం చదవండి
10:38 PM (IST) Apr 07

Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన ... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

rains: రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పూర్తి కథనం చదవండి
10:12 PM (IST) Apr 07

బంగ్లాదేశ్ తో భారత్ స్నేహం ... పాకిస్తాన్ అందుకే మాటతప్పిందా?

పాకిస్తాన్ యుద్ధనౌక పంపుతానని బంగ్లాదేశ్ కు ఇచ్చినమాట తప్పింది. ఇది స్నేహంలో మోసమా? ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి
09:56 PM (IST) Apr 07

AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌.. జిల్లాల వారీగా పోస్టులు ఎన్నంటే!

ap dsc notificatio:ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే నోటిఫికేషన్‌ వస్తుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఎట్టకేలకు నోటిఫికేషన్‌ ఇచ్చి తీరాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌ రావాల్సి ఉండగా.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. నోటిఫికేషన్‌ విడుదల తేదీని సూచనప్రాయంగా తెలిపారు.

పూర్తి కథనం చదవండి
09:53 PM (IST) Apr 07

ఈ హైబ్రిడ్ కారు.. అందుబాటులోకి వచ్చిందంటే.. మైలేజీ కింగే!

కారు కొనాలి అనుకుంటే ఇండియాలో ఎవరికైనా ముందు గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకీ. నమ్మకమైన బ్రాండ్, తక్కువ ధర కారణంగా ఈ బ్రాండ్ టాప్ సెల్లర్ గా నిలుస్తోంది. కాంపాక్ట్ క్రాసోవర్ విభాగంలో ఈ కంపెనీ మోడల్ ఫ్రాంక్స్ అత్యధికంగా అమ్ముడవుతోంది. దాంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ మోడళ్లో హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది మారుతి సుజుకి.

పూర్తి కథనం చదవండి
09:33 PM (IST) Apr 07

MI vs RCB: రెచ్చిపోయిన కోహ్లీ, పాటిదార్‌.. ముంబై టార్గెట్‌ ఎంతో తెలుసా.?

ఐపీఎల్‌ 2025లో వాంఖడే స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బ్యాటర్లు చెలరేగారు. విరాట్‌ కోహ్లీ, పాటిదార్‌ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. మరి ముంబై ఈ టార్గెట్‌ను అధిగమిస్తుందా, ఇంతకీ ముంబై విజయానికి ఎన్ని పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
09:31 PM (IST) Apr 07

indian idol winner బాప్ రే.. ఇండియన్ ఐడల్ 15 విజేతకు ఇన్ని నజరానాలా?

ఇండియన్ ఐడల్ 15 విజేత: ఇండియాలో ఇండియన్ ఐడల్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. పాడటం అంటే ఇష్టపడే గాయకులు జీవితంలో ఒక్కసారైనా ఈ షోలో పాల్గొనాలనుకుంటారు. అంతటి పాపులారిటీ ఉన్న ఈ సింగింగ్ కాంపిటీషన్ 'ఇండియన్ ఐడల్ 15'లో కోల్‌కతాకు చెందిన మానసి ఘోష్ ఈసారి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు మానసికి ఏమేం దక్కాయంటే..

పూర్తి కథనం చదవండి
09:11 PM (IST) Apr 07

Dharashiv : కరువును పారదోలేందుకు కదిలిన ప్రజానికం... దేశానికే ఆదర్శం ఈ ధారాశివ్

మహారాష్ట్రలోని కరువు పీడిత ధారాశివ్ జిల్లాలో 734 గ్రామాల మధ్య నీటి యాజమాన్య పోటీ మొదలైంది ఉత్తమ నమూనాకు జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. ఈ గ్రామాల జల పునరుజ్జీవన ఉద్యమం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
08:50 PM (IST) Apr 07

గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ బుకింగ్స్.. దారుణంగా అజిత్ సినిమా పరిస్థితి ?

అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి కథనం చదవండి
08:42 PM (IST) Apr 07

Virat Kohli: విరాట్‌ మరో సంచలనం.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్‌.

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అరుదైన ఘనతను సాధించాడు. టీ20లో అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు కోహ్లి. తాజాగా సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను సాధించాడు. ఇంతకీ కోహ్లీ సాధించిన ఆ ఘనత ఏంటి.? ఈ జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
08:16 PM (IST) Apr 07

Optics: ఈ రోజు మనం ఇంటర్నెట్ వాడుతున్నామంటే దానికి ఈ వ్యక్తే కారణం.. ఇంతకీయన ఎవరంటే

ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఎంతలా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 5జీ వరకు మన ఇంటర్నెట్‌ ప్రయాణం చేరుకుంది. ఇప్పటికే 6జీకి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. ఒకప్పుడు నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్‌ వేగం ఇప్పుడు జెట్‌ వేగంతో పెరిగింది. బఫరింగ్ లేకుండా వీడియోలను వీక్షిస్తున్నాం. అయితే ఇంటర్నెట్‌ విప్లవానికి ప్రధాన కారణమైన ఆప్టికల్ కేబుల్స్‌ను కనిపెట్టిన వ్యక్తి మన భారతీయుడే అని మీలో ఎంత మందికి తెలుసు.? ఇంతకీ ఎవరా వ్యక్తి ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 

పూర్తి కథనం చదవండి
08:05 PM (IST) Apr 07

Holidays : ఒక్కరోజు మేనేజ్ చేస్తే చాలు... వరుసగా ఏప్రిల్ 10,11,12,13, 14 ఐద్రోజులు సెలవులే

Telangana and Andhra Pradesh Holidays : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులే కాదు ఉద్యోగులకు కూడా ఈవారం వరుస సెలవులు వస్తున్నాయి. ఇంకో రెండ్రోజులు మాత్రమే వర్కింగ్ డేస్... మిగతా ఐద్రోజుల్లో ఒక్కరోజు మినహా మిగతావన్నీ సెలవులే. ఈ ఒక్కరోజు లీవ్ తీసుకుంటే వరుసగా ఐదురోజుల సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. ఏఏ రోజు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:44 PM (IST) Apr 07

PAN with Aadhaar: ఆ తేదీ లోపు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు

PAN with Aadhaar: పాన్ కార్డు ఉన్న వాళ్లు అందరూ ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) మరికొంత కాలం గడువు ప్రకటించింది. అయితే ఆ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకపోతే పాన్ కార్డు రద్దు అవుతుంది. ఈ విషయం గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:35 PM (IST) Apr 07

MI vs RCB: బెంగళూరు విజయం అంత వీజీ ఏం కాదు.. ఆ ముగ్గురితో పొంచి ఉన్న ప్రమాదం

ఐపీఎల్‌ 2025లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబైని ఓడించి వాంఖడే స్టేడియంలో జెండా పాతాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే బెంగళూరుకు విజయం అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ముగ్గురు బౌలర్స్‌తో ఆర్సీబీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు.? వారితో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 

పూర్తి కథనం చదవండి
06:30 PM (IST) Apr 07

Gas Cylinder Price Hike : సామాన్యులపై వంటింటి భారం ... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరను మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ధరల పెంపు తప్పలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇంతకూ ఒక్కో సిలిండర్ ధర ఎంత పెరిగిందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
06:25 PM (IST) Apr 07

Poco C71: రూ. 6 వేలలో ఇలాంటి ఫీచర్లు ఎంటి భయ్యా.. తడి చేతులతో కూడా ఆపరేట్‌ చేయొచ్చు.

మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌ సందడి చేస్తోంది. మారిన టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. పోకో సీ71 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:20 PM (IST) Apr 07

విజయ్ సేతుపతికి జోడిగా 50 ప్లస్ హీరోయిన్.. పూరి జగన్నాధ్ పెద్ద ప్లానే వేశాడే..

Vijay Sethupathi and Puri Jagannadh Movie :విజయ్ సేతుపతి కొత్త సినిమాలో అజిత్ హీరోయిన్ జోడీగా నటిస్తోందట. విజయ్ సేతుపతికి హీరోయిన్ గా 50 ఏళ్లపైగా వయసు ఉన్న నటిని హీరోయిన్ గా ఎంచుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

పూర్తి కథనం చదవండి