
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత
భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని మొత్తం పోలీసు, ప్రత్యేక భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయ. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బంది, స్నైపర్ టీమ్స్‌తో పాటు ఇంటెలిజెన్స్ విభాగం కూడా నిఘా పెంచింది. పుతిన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు.