11:41 PM (IST) Apr 18

GI-PKL 2025: తెలుగు పాంథర్స్ నుంచి తమిళ్ లయన్స్ వరకు.. జీఐపీకేఎల్ 2025 టీమ్స్ ఇవే

GI-PKL 2025: కబడ్డీ క్రీడను అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి జీఐపీకేఎల్ నిర్వహిస్తున్నారు. 2025లో మొదటి ఎడిషన్ గురుగ్రామ్ లో జరుగుతోంది. గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) 2025 లో పాల్గొంటున్న పురుషుల జట్ల ఆటగాళ్ల పూర్తి జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి
11:12 PM (IST) Apr 18

18 Years of IPL: ఇది 18 ఏళ్ల ఐపీఎల్ పండుగ.. క్రికెట్ ఆడే విధానమే మార్చిపడేశారు

18 Years of IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ పుట్టిన రోజును జ‌రుపుకుంటోంది. 2008లో ప్రారంభమై మెగా క్రికెట్ లీగ్ గా మారింది. టీ20 క్రికెట్, క్రీడా వినోదాన్ని విప్లవాత్మకంగా మార్చింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఈ లీగ్ లో ఐకానిక్ క్షణాలు చాలా ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి
10:51 PM (IST) Apr 18

Health Tips: గసగసాలతో ఒంట్లో వేడి దూరం.. సర్వరోగనివారిణి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

Health Tips: మన వంటగదిలోనే మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు.. ప్రకృతిని మనకు ఏది లభించినా.. అది మనకోసం సృషించబడిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. తేనే కంటే.. గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

పూర్తి కథనం చదవండి
09:49 PM (IST) Apr 18

Fruits and Vegetables Together: పండ్లు, కూరగాయలు ఒకేచోట నిల్వచేస్తే డేంజరంట.. ఎందుకో తెలుసా?

Fruits and Vegetables: పండ్లు, కూరగాయలు వాటి తాజా దనాన్ని, పోషక విలువలను కాపాడుకోవడానికి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. అయితే, చాలా మంది వాటిని కలగలిపి ఒకేచోట నిల్వ చేస్తుంటారు. ఇలా చేస్తనే తప్పులో మీరు కాలేసినట్లే.. ఒకేచోట రెండింటిని కలిపి నిల్వ చేయడం వల్ల కొన్ని ఉత్పత్తులు త్వరగా పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా...

పూర్తి కథనం చదవండి
09:01 PM (IST) Apr 18

Gold : బంగారం వినియోగంలో టాప్-10 దేశాలు.. భారత్ ర్యాంకు ఎంత?

Most Gold used Countries: భారత్ లో బంగారం వినియోగంలో గత మూడేళ్ల గణాంకాలు గమనిస్తే రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 2024లో మొత్తం బంగారం డిమాండ్ 802.8 టన్నులుగా ఉంది. ఇది 2023 తో పోలిస్తే 5 శాతం పెరుగుదలను నమోదుచేసింది. అయతే, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉపయోగిస్తున్న టాప్-10 దేశాలు ఏవి? ఇందులో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:50 PM (IST) Apr 18

18 Years of IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్-5 బ్యాట్స్‌మెన్

Fastest Century In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఇదే రోజున అంటే 2008 ఏప్రిల్ 18 క్రికెట్ ప్రపంచంలో కొత్తగా దూసుకువచ్చిన ఐపీఎల్ ఇప్పుడు రిచ్ క్రికెట్ లీగ్ గా మారింది. క్రికెట్ లవర్స్ కు మస్తు మజాను అందిస్తోంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో ధనాధన్ ఇన్నింగ్స్ తో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:10 PM (IST) Apr 18

Alekhya pickles: కొత్త ప్లాన్‌తో వ‌స్తున్న ఆలేఖ్య సిస్ట‌ర్స్‌.. ఈసారి ఏం చేయ‌నున్నారంటే.

ఆలేఖ్య చిట్టి పికిల్స్ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు సిస్ట‌ర్స్ క‌లిసి నాన్ వెజ్ ప‌చ్చ‌ళ్ల వ్యాపారాన్ని ప్రారంభించి భారీగా లాభాలు ఆర్జించారు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఓ వివాదంతో ఈ ముగ్గురు విప‌రీత‌మైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. దెబ్బ‌కు వ్యాపారాన్ని ముసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఈ సిస్ట‌ర్స్ ఇప్పుడు మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆలేఖ్య సిస్ట‌ర్స్ ఈసారి ఏం చేయనున్నారంటే.. 

పూర్తి కథనం చదవండి
07:08 PM (IST) Apr 18

Rohit Sharma Son : వైరల్‌ అవుతోన్న హిట్‌మ్యాన్‌ కొడుకు ఫొటో.. పేరేంటో తెలుసా?

Rohit sharma: ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నేతృత్వంలో టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు టీ-20 వరల్డ్‌ కప్పు కైవసం చేసుకుంది. జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌ అయినప్పటి నుంచి టీమిండియాకి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. డాషింగ్‌ ఒపెనర్‌గా జట్టును ముందుకు నడపడంతో రోహిత్‌ దిట్ట. 

పూర్తి కథనం చదవండి
06:47 PM (IST) Apr 18

New Tax Regime: కొత్త టాక్స్ రిజిమ్‌లో ఎంత డబ్బును ఆదా చేసుకోవచ్చు?

Benefits of the new tax regime: ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం జీతం తీసుకునే వారికి పెద్ద ఊరటనిస్తూ, కొత్త టాక్స్ రిజిమ్ కింద 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును ప్రకటించింది. బడ్జెట్ నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త టాక్స్ నిబంధనల ప్రకారం మీరు ఎంత వరకు డబ్బును ఆదా చేసుకోగలరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
06:22 PM (IST) Apr 18

కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం ... సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన

రాహుల్ గాంధీ విజ్ఞప్తి మేరకు కర్ణాటకలో రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. విద్యారంగంలో కుల వివక్షతను నిర్మూలించడం, అట్టడుగు వర్గాల విద్యార్థులకు సామాజిక న్యాయం అందించడం ఈ చట్టం లక్ష్యం.

పూర్తి కథనం చదవండి
06:04 PM (IST) Apr 18

IPL 2025లో సంచలన ప్రారంభం: ఢిల్లీ క్యాపిటల్స్‌ దూకుడు, క్లాసేన్ రికార్డు, యువ క్రికెటర్ల సత్తా బైటపడింది

ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంలో ప్రపంచ బెట్టింగ్ కంపెనీ 1xBet ఏ జట్టుకి ఎక్కువ మద్దతు లభిస్తుందో తెలుసుకోవడానికి అభిమానుల పోల్ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
05:30 PM (IST) Apr 18

KL Rahul: బర్త్ డే సర్​ప్రైజ్.. కూతురి పేరు రివీల్ చేసిన కేఎల్ రాహుల్.. ఆ పేరుకు అర్థమేంటి?

KL Rahul daughter Name: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్-అతియా శెట్టిలు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. మార్చి 24న ఈ స్టార్ కపుల్ కు ఆడబిడ్డ పుట్టింది. తన బర్త్ డే రోజున మరో గుడ్ న్యూస్ చెబుతూ కూతురు పేరును రివీల్ చేశారు. ఆ పేరేంటి? దానికి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
05:29 PM (IST) Apr 18

మీ వాహనంలో పెట్రోల్ అయిపోతే ... ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్ తెప్పించుకోండిలా...

మీరు ఎక్కడికైనా వెళుతుంటే సడన్ గా వాహనంలో పెట్రోల్ అయిపోయినా లేదా మరేదైనా సహాయం అవసరమైనా కంగారుపడకండి. మీ సహాయం కోసమే NHAI ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
04:43 PM (IST) Apr 18

IPL: ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా? షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL Match Power Facts: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి బంతికీ థ్రిల్, ప్రతి షాట్‌కీ హోరు, ప్రతి స్టేడియంలో జిగేల్ మనే లైట్లు.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే, ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంత కరెంటు ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాలు ఇప్పుడు మిమ్మల్ని తప్పకుండా షాక్ చేస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
04:40 PM (IST) Apr 18

JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల... ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదలయ్యింది.ఫైనల్ ఆన్సర్ కీ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంది...డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.

పూర్తి కథనం చదవండి
04:32 PM (IST) Apr 18

బాలీవుడ్ లో టాప్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్న ఐదుగురు హీరోయిన్లు

ఈ ప్రముఖ నటీమణులు హార్డ్-హిట్టింగ్ డ్రామాల నుండి హై-ఆక్టేన్ యాక్షన్ వరకు అన్ని శైలుల్లో చిత్రాలకు నాయకత్వం వహిస్తున్నారు, అంతేకాకుండా మహిళా నేతృత్వంలోని కథనాలు బాక్సాఫీస్‌ను ఆకర్షించగలవని నిరూపిస్తున్నారు

పూర్తి కథనం చదవండి
04:23 PM (IST) Apr 18

Numerology: ఈ 3 తేదీల్లో పుట్టిన వారు చాలా రొమాంటిక్ అంద‌రినీ ఇట్టే ఆక‌ట్టుకుంటారు

మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. ఇందులో న్యూమరాలజీ ఒకటి. పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. లాంటి అంశాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు అంటుంటారు. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
03:50 PM (IST) Apr 18

Telangana Inter Results 2025 : విడుదల తర్వాత మీ పిల్లల రిజల్ట్ ఇలా చెక్ చేయండి, స్టెప్ బై స్టెప్ గైడ్

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనకు సర్వం సిద్దమయ్యింది. రేపోమాపో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఫలితాలను ప్రకటించనుంది. మీ పిల్లలు కూడా ఇంటర్ పరీక్షలు రాసారా? అయితే ఫలితాల విడుదల తర్వాత ఇలా చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ అందిస్తున్నాం.

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) Apr 18

Hyundai creta: రూ. 50 వేల జీతం ఉన్నా చాలు.. ఈ కారు కొనుక్కోవ‌చ్చు. రూ. ల‌క్ష డౌన్‌పేమెంట్‌తో..

కారు కొనుగోలు చేయాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆశిస్తుంటారు. ఒక‌ప్పుడు కేవ‌లం ల‌గ్జ‌రీగా భావించిన కారు, ఇప్పుడు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుగా మారిపోతోంది. ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత కారును ఉప‌యోగించే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల వినియోగం పెరిగింది. అయితే బ్యాంకులు ఆఫ‌ర్ల‌తో కొత్త కార్ల‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే హ్యుందాయ్ క్రెటాపై మంచి డీల్ ల‌భిస్తోంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే ఎంత డౌన్‌పేమెంట్ క‌ట్టాలి.? ఈఎమ్ఐ ఎంత ఉంటుంది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
02:47 PM (IST) Apr 18

Modi-Musk: అంద‌రి దృష్టి ఆ ఫోన్ కాల్‌పైనే.. మోదీ, ఎలాన్ మ‌స్క్ ఏం మాట్లాడ‌రబ్బా.?

ఓ వైపు అమెరికా ప్రపంచ దేశాలపై టారిఫ్ ల దాడి చేస్తున్న తరుణంలో ప్రపంచ కుబేరుడు, అమెరికా ప్రభుత్వ డోజ్ విభాగం అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత ప్రధాని మోదీల మధ్య ఫోన్ సంభాషణ అందరినీ ఆకర్షించింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఏం మాట్లాడారు.? ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి