MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Alekhya pickles: కొత్త ప్లాన్‌తో వ‌స్తున్న ఆలేఖ్య సిస్ట‌ర్స్‌.. ఈసారి ఏం చేయ‌నున్నారంటే.

Alekhya pickles: కొత్త ప్లాన్‌తో వ‌స్తున్న ఆలేఖ్య సిస్ట‌ర్స్‌.. ఈసారి ఏం చేయ‌నున్నారంటే.

ఆలేఖ్య చిట్టి పికిల్స్ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు సిస్ట‌ర్స్ క‌లిసి నాన్ వెజ్ ప‌చ్చ‌ళ్ల వ్యాపారాన్ని ప్రారంభించి భారీగా లాభాలు ఆర్జించారు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఓ వివాదంతో ఈ ముగ్గురు విప‌రీత‌మైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. దెబ్బ‌కు వ్యాపారాన్ని ముసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఈ సిస్ట‌ర్స్ ఇప్పుడు మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆలేఖ్య సిస్ట‌ర్స్ ఈసారి ఏం చేయనున్నారంటే..  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 18 2025, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Alekhya chitti pickles

Alekhya chitti pickles

పచ్చళ్ల ధర ఎక్కువగా ఉందని అడిగినందుకు క‌స్ట‌మ‌ర్‌పై బూతులతో రెచ్చిపోయిన అలేఖ్య చివరికి  హాస్పిటల్ పాలైంది.  సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. నెటిజ‌న్లు పెద్ద ఎత్తున వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌కి రిపోర్ట్ కొట్ట‌డంతో అకౌంట్ బ్లాక్ అయ్యింది.

దీంతో వెబ్‌సైట్ క్లోజ్ చేసి వ్యాపారం మూసేశారు. క‌స్ట‌మ‌ర్‌ను అలా తిట్ట‌డం త‌ప్పేన‌ని, ఈ వ్య‌వ‌హారాన్ని ఇక్క‌డితో వ‌దిలేయాల‌ని క్ష‌మాప‌ణ‌లు సైతం చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డింది. అయితే తాజాగా అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య గోపాల్ కంచర్ల తాజా మ‌రో వీడియోను పోస్ట్ చేసి, త‌మ ఫ్యూచ‌ర్ ప్లాన్ గురించి వివ‌రించారు. 

24
Alekhya Chitti Pickles

Alekhya Chitti Pickles

త‌మ పికిల్స్ వ్యాపారం 11 నెలలు బాగా నడిచిందని, కానీ ఈ కాంట్రవర్సీ వల్ల ఇంత తక్కువ సమయంలోనే మూసేస్తామని అనుకోలేద‌ని చెప్పుకొచ్చారు. త‌ర్వాత ఏం చేద్దామ‌ని ఇన్ని రోజులు డైలామాలో ఉన్నామ‌ని, ఇప్పుడు మ‌రోసారి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యామ‌ని ప్ర‌క‌టించారు.

ఈసారి కూడా పికిల్స్ వ్యాపారాన్నే మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరును రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కంబ్యాక్ ఇద్దామని అనుకుంటున్నామ‌ని చెప్పుకొచ్చారు. 
 

34
Alekhya Chitti Pickles

Alekhya Chitti Pickles

గ‌తంలోలా కాకుండా ఈసారి రమ్య మోక్ష పికిల్స్ అందరికీ అందుబాటు ధరలలో తీసుకొస్తామ‌ని తెలిపారు. ధ‌ర‌కు తగ్గ క్వాలిటీ కూడా అందిస్తామ‌ని చెప్పుకొచ్చారు. అలాగే కస్టమర్లతో మాట్లాడేందుకు ఒక‌రిని రిక్రూట్ చేసుకుంటున్నామ‌ని, ఇందులో  అలేఖ్యను ఇన్వాల్వ్ చేయమ‌ని తెలిపారు.

ఈసారి వ్యాపారాన్ని తాను మాత్ర‌మే చూసుకుంటాన‌ని చెప్పుకొచ్చారు. మ‌రో రెండు నెల‌ల్లో రమ్యమోక్ష పికిల్స్‌తో, స్ట్రాంగ్‌గా వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌ను ఆద‌రించి, అండ‌గా నిలిచిన ప్ర‌జ‌లు అదే స‌పోర్ట్ అందిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు ర‌మ్య తెలిపారు. 

44
Alekhya Chitti Pickles

Alekhya Chitti Pickles

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కొన్ని రోజుల పాటు వార్త‌ల్లో లేని అలేఖ్య సిస్ట‌ర్స్  ఈ వీడియోతో మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. మ‌ళ్లీ దండ‌యాత్ర చేసేందుకు వ‌స్తున్నారా అక్క అంటూ, ఈసారైనా సామాన్యుల‌కు ప‌చ్చ‌ళ్లు అందుబాటులో ఉంటాయా అంటూ నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ర‌మ్య మోక్ష పికిల్స్ పేరుతో వ‌స్తున్న ఈ సిస్ట‌ర్స్ ఈసారి ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి. రమ్య పోస్ట్ చేసిన పూర్తి వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
ఈ రాయలసీమ జిల్లాలో అమరావతి స్థాయి రియల్ బూమ్.. భూములకు రెక్కలురావడం ఖాయం
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved