Numerology: ఈ 3 తేదీల్లో పుట్టిన వారు చాలా రొమాంటిక్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు
మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. ఇందులో న్యూమరాలజీ ఒకటి. పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. లాంటి అంశాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు అంటుంటారు. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సంఖ్యాశాస్త్రంలో ప్రతి పుట్టిన తేదీకి ప్రత్యేకమైన మూల సంఖ్య ఉంటుంది. పుట్టిన తేదీలోని అంకెల మొత్తాన్ని కలిపినప్పుడు వచ్చే సంఖ్యే మూల సంఖ్య. ఈ సంఖ్య 1 నుండి 9 వరకు ఉండొచ్చు. ఈ సంఖ్యల ద్వారా వ్యక్తుల లక్షణాలు, జీవనశైలి, ఆర్థిక స్థితి, శ్రేయస్సు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అంచనా వేయవచ్చు.
న్యూమరాలజీలో 6కి ప్రత్యేక స్థానం ఉంది. 6, 15 లేదా 24 తేదీలలో పుట్టినవారు ఈ మూల సంఖ్యకు చెందుతారు. దీనినే రాడిక్స్ నెంబర్గా కూడా చెబుతుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ వీరిపై ఉంటాయని నమ్ముతున్నారు. మూల సంఖ్య 6కు అధిపతి గ్రహంగా శుక్రుడు ఉంటాడు. శుక్రుడు ప్రేమ, ధనం, సౌందర్యం, కళలకు ప్రతీక. ఈ ప్రభావంతో, ఈ సంఖ్యకు చెందినవారు ఆర్థికంగా సుస్థిరంగా ఉంటారు. వీరికి ఆర్థిక కష్టాలు అనేవి రావు.
6 సంఖ్య వారికి ఉండే ప్రత్యేకతలు:
వీరిలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. సంగీతం, కళ, డిజైన్, ఫ్యాషన్ రంగాలలో మంచి ప్రతిభ కనబరుస్తారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఇతరులపై ప్రభావం చూపగల శక్తివంతమైన వాక్ శ్చాత్తుర్యం కలిగి ఉంటారు. మైత్రి భావం ఎక్కువగా ఉంటుంది. వీరికి స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారు సాధారణంగా ఉల్లాసంగా, వినయంగా ఉంటారు. ధనవంతులైనా గర్వం చూపకుండా, సాదాసీదాగా ఉంటారు.
ఆర్థిక సమస్యలు వచ్చినా వెంటనే అధిగమిస్తారు. ఈ సంఖ్యకు చెందిన వారు జీవితంలో ధనం, ప్రేమ, కలలు, కీర్తి అన్ని పొందుతారు. శుక్రుని అనుగ్రహంతో వీరి జీవితం అందంగా, ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద ఎప్పటికీ తక్కువ ఉండదని నమ్ముతారు.