MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మీ వాహనంలో పెట్రోల్ అయిపోతే ... ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్ తెప్పించుకోండిలా...

మీ వాహనంలో పెట్రోల్ అయిపోతే ... ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్ తెప్పించుకోండిలా...

మీరు ఎక్కడికైనా వెళుతుంటే సడన్ గా వాహనంలో పెట్రోల్ అయిపోయినా లేదా మరేదైనా సహాయం అవసరమైనా కంగారుపడకండి. మీ సహాయం కోసమే NHAI ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 18 2025, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
NHAI

NHAI

National Highways Helpline  : దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటపుడు ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. కొత్త ప్రదేశాల్లో ఏది ఎక్కడుందో మనకు తెలియదు... ఇలాంటప్పుడు పెట్రోల్ బంక్ కనుక్కోవడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ అయిపోయి రోడ్డుపై నిడబడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఏంచేయాలి? ఎవరి సహాయం తీసుకోవాలి? అనేది అంతుచిక్కకుండా ఉంటుంది. 

అయితే జాతీయ రహదారులపై ప్రయాణ సమయంలో ఇలాంటి సమస్య ఎదురైతే ఏం చింతించకండి. వాహనాన్ని తోసుకుంటూ వెళ్లడం లేదంటే ఇతర వాహనదారుల సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు... మనం ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్ తెప్పించుకోవచ్చు. ఇండియన్ నేషనల్ హైవే అథారిటీ (NHAI) హెల్ప్‌లైన్ నంబర్ 1033 కి కాల్ చేసి ఈ సహాయం పొందవచ్చు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
NHAI

NHAI

కేవలం NHAI హెల్ప్ లైన్ నంబర్ కే కాదు మరికొన్ని నంబర్లకు ఫోన్ చేసికూడా సహాయం పొందవచ్చు. 8577051000 లేదా 7237999944 - పెట్రోల్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. మీ లొకేషన్, పేరు చెప్పి ఈ సహాయం పొందవచ్చు. సహాయకులు మీ దగ్గరికి వచ్చి పెట్రోల్/డీజిల్ ఇస్తారు... వారికి ఈ ఇంధనానికి సంబంధించిన డబ్బులు మాత్రమే చెల్లించాలి, అదనపు ఛార్జీలు ఉండవు.

34
NHAI

NHAI

ఇలా చేయండి

ముందుగా వాహనాన్ని పక్కకు ఆపి టోల్ రశీదులో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ లేదా 1033 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. మీ లొకేషన్, పేరు చెప్పండి. సహాయకులు మీ దగ్గరికి వచ్చి పెట్రోల్/డీజిల్ ఇస్తారు. ఈ నంబర్లను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి. డ్రైవర్లకు సహాయం చేయడానికి అన్ని టోల్ ప్లాజాలలో అంబులెన్స్‌లు, రికవరీ వ్యాన్లు, సెక్యూరిటీ టీమ్‌లు ఉంటాయి. టోల్ ప్లాజా దాటిన తర్వాత, మీకు ఇచ్చే రశీదులో NHAI టోల్ ఫ్రీ నంబర్ 1033 ఉంటుంది.

44
NHAI

NHAI

ఈ నంబర్ ఫాస్టాగ్‌కూ ఉపయోగపడుతుంది

టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ పనిచేయకపోతే, కస్టమర్  1033 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫాస్టాగ్ సహా హైవే వినియోగదారులకు అన్ని రకాల రోడ్డు సహాయం అందించడానికి NHAI 1033 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Recommended image2
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image3
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved