MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold : బంగారం వినియోగంలో టాప్-10 దేశాలు.. భారత్ ర్యాంకు ఎంత?

Gold : బంగారం వినియోగంలో టాప్-10 దేశాలు.. భారత్ ర్యాంకు ఎంత?

Most Gold used Countries: భారత్ లో బంగారం వినియోగంలో గత మూడేళ్ల గణాంకాలు గమనిస్తే రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 2024లో మొత్తం బంగారం డిమాండ్ 802.8 టన్నులుగా ఉంది. ఇది 2023 తో పోలిస్తే  5 శాతం పెరుగుదలను నమోదుచేసింది. అయతే, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉపయోగిస్తున్న టాప్-10 దేశాలు ఏవి? ఇందులో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2025, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Most Gold used Countries

Most Gold used Countries

Top 10 countries by gold consumption: ప్రపంచంలో అత్యధిక బంగారం వినయోగించే దేశాల్లో భారత్ ఒకటి. బంగారం వినియోగంలో భారతదేశం 2024లో చైనాను అధిగమించింది. భారత్ లో గోల్డ్ కు ఉన్న డిమాండ్, సాంస్కృతిక సంప్రదాయాలు, పెట్టుబడి ప్రాధాన్యతలు, పారిశ్రామిక ఉపయోగాల క్రమంలో భారత్ లో బంగారం వినియోగం అధికంగా ఉంది. అత్యధిక బంగారం వినియోగం ఉన్న టాప్ 10 దేశాల వివరాలు గమనిస్తే..

10. ఇండోనేషియా:

ఇండోనేషియా బంగారం వినియోగంలో టాప్-10 దేశాల్లో 10వ స్థానంలో ఉంది. ఈ దేశంలో గోల్డ్ వినియోగం ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం ఉంటుంది. ఆ తర్వాత పొదుపు, పెట్టుబడిగా ఉంది. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ కు మస్తు డిమాండ్ ఉంటుంది.

9. వియత్నాం:

వియత్నాంలో గోల్డ్ పై పెట్టుబడులు అధికంగా ఉంటాయి. అభరణాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక ఆసియా దేశాల మాదిరిగానే బంగారం అంటే చాలు అల్లుకుపోతారు ఇక్కడి ప్రజలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
What are the top 10 countries that use the most gold in the world? Where does India rank?

What are the top 10 countries that use the most gold in the world? Where does India rank?

8. ఇరాన్:

ఇరాన్ సాంస్కృతిక అంశాలతో బంగారం ముడిపడి ఉంటుంది. ఇరాన్‌లో బంగారం  ఎక్కువగా అభరణాలు, పెట్టుబడితో పాటు తమ ఆర్థిక అస్థిరత, కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాలతో బంగారం ఎక్కువగా కొనిపెట్టుకుంటారు.

7. టర్కీ:

టర్కీలో బంగారం సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక్కడ గోల్డ్ ను ఆభరణాలతో పాటు సాంప్రదాయ పెట్టుబడి ఆస్తిగా చూస్తారు. ఎక్కువగా గోల్డ్ నాణేలు, గాజుల రూపంలో ఉంటుంది.

 

35
What are the top 10 countries that use the most gold in the world?

What are the top 10 countries that use the most gold in the world?

6. సౌదీ అరేబియా:

బంగారు ఆభరణాలకు బలమైన సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు అద్భుతమైన డిజైన్‌లు, లగ్జరీ లైఫ్ కు సూచీగా బంగారాన్ని చూస్తారు. అందుకే సౌదీ అరేబియాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది.

5. థాయిలాండ్:

థాయిలాండ్‌లో కూడా బంగారినికి మస్తు డిమాండ్ ఉంటుంది. అలంకరణ, సాంప్రదాయ పొదుపు-పెట్టుబడి రూపంగా గోల్డ్ ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ బంగారు దుకాణాలు చాలా ఉంటాయి. పెళ్లిళ్ల సమయంలో బంగారు కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయి.

45
top 10 countries that use the most gold

top 10 countries that use the most gold

4. జర్మనీ:

యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జర్మనీ బంగారు వినియోగం కడ్డీలు, నాణేల రూపంలో కనిపిస్తుంటుంది. గోల్డ్ ను ధరించడంతో పోలిస్తే నిల్వకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే, పారిశ్రామిక వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది.

3. యునైటెడ్ స్టేట్స్ (అమెరికా): 

అమెరికాలో బంగారు వినియోగం కేవలం ఆభరణాలకే మాత్రమే పరిమితం కాదు.. పారిశ్రామికంగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే, పెట్టుబడులు, నిల్వ చేసుకోవడం, ఎలక్ట్రానిక్స్, వైద్య రంగం, అంతరిక్ష రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

55
Top 10 countries by gold consumption

Top 10 countries by gold consumption

2. చైనా:

బంగారం అధికంగా ఉపయోగించే ప్రపంచ దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. బంగారు ఆభరణాల పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం కారణంగా బంగారం డిమాండ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అభరణాలతో పాటు బంగారు కడ్డీలు, నాణేలకు డిమాండ్ ఉంటుంది. అలాగే, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో చైనా బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటుంది.

1. భారత్:

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారత్. గతేడాది చైనాను అధిగమించి మొదటి స్థానంలోకి వచ్చింది. భారత్ లో సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు, వివాహాలు, పండుగలతో బంగారానికి బలమైన అనుబంధం ఉంటుంది. ఆభరణాల తయారీలో బంగారం డిమాండ్ భారత్ లో రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అలాగే, బంగారం కొనిపెట్టుకోవడానికి, పెట్టుబడులకు కూడా భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. బంగారాన్ని భారత్ లో బలమైన ఆస్తిగా కూడా చూస్తారు అందుకే బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బంగారం
పర్సనల్ పైనాన్స్
స్టాక్ మార్కెట్
భారత దేశం
చైనా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved