ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించింది.

ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ తరపున వాదనలను, చిదంబరం తరపున వాదనలను సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం సాయంత్రం వింది. వాదనలను విన్న తర్వాత 30 నిమిషాల పాటు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో గురువారం సాయంత్రం 06:45 గంటలకు కోర్టు తీర్పును వెల్లడించింది.

ప్రతి రోజూ చిదంబరం కుటుంబసభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.  ప్రతి రోజూ 30 నిమిషాల పాటు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.లాయర్లను కూడ కలుసుకొనేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.  తీర్పు తర్వాత కోర్టు నుండి సీబీఐ కార్యాలయానికి మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తరలించారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేయకూడదని ముందస్తు బెయిల్ కోసం మంగళవారంనాడు చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బుధవారం నాడు చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్ పై ఈ నెల 25వ తేదీన విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

దీంతో బుధవారం నాడు రాత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చిదంబరం నుండి సమాచారాన్ని రాబట్టేందుకు గాను కస్టడీని కోరారు. ఐదు రోజుల పాటు సీబీఐ అధికారులు చిదంబరాన్ని కస్టడీ కోరారు.ఈ నెల 26వ తేదీ వరకు చిదంబరం కస్టడీ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

ఐఎన్ఎక్స్ కేసులో ముగిసిన వాదనలు: తీర్పుపై ఉత్కంఠ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!