Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

తన తండ్రి అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రేనని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చెప్పారు. 

Political Witch Hunt, Says Karti Chidambaram after Father's Arrest
Author
New Delhi, First Published Aug 21, 2019, 10:26 PM IST


న్యూఢిల్లీ:తన తండ్రి చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తనయుడు కార్తి చిదంబరం చెప్పారు.

మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత న్యూఢిల్లీలోని ఇంటి వద్ద కార్తీ చిదంబరం మీడియాతో మాట్లాడారు.న్యాయ ప్రకియపై తమకు నమ్మకం ఉందన్నారు. తన తండ్రిని అరెస్ట్ చేయడాన్ని ఆయన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 

ఎవరినో సంతృప్తి పర్చేందుకు సీబీఐ అధికారులు తాపత్రయపడుతున్నారని ఆయన చెప్పారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం రాజకీయాల కోసం వాడుకొంటుందన్నారు. 

సీబీఐ, ఈడీ ఎదుట 20 సార్లు విచారణకు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తమ కుటుంబంపై ఆరోపణలు అవాస్తవమన్నారు.మా నాన్న ఇంత వరకు ఎక్కడికి పోలేదన్నారు.

అంతకుముందు ఆయన ట్వీట్ లో కూడ ఈ విషయమై ఆయన స్పందించారు.తనపై నాలుగు సార్లు సీబీఐ అధికారులు దాడి చేశారని ఆయన చెప్పారు. ఈ కేసులో ఇంతవరకు సీబీఐ చార్జీషీట్ దాఖలు చేయనందున అసలు కేసే లేదన్నారు. తాను సీబీఐకు అథిగా ఉన్నానని ఆయన సెటైర్లు వేశారు. సీబీఐ పని గురించి తనకు తెలుసునని ఆయన చెప్పారు.
 

సంబంధిత వార్తలు

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

Follow Us:
Download App:
  • android
  • ios