న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఏక్షణాన్నైనా చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు సీబీఐ, ఈడీ అధికారులు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి చిదంబరం నేరుగా ఇంటికి చేరుకున్నారు. 

ఇంటికి చేరుకున్న వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేసేశారు. చిదంబరం ఇంటికి చేరుకున్నారన్న సమాచారంతో సీబీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గేటు దూకి మరీ చిదంబరం ఇంట్లోకి వెళ్లారు సీబీఐ అధికారులు. 

ఇకపోతే చిదంబరం తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులతో సమావేశమయ్యారు. సల్మాన్ ఖర్షీద్, కపిల్ సిబాల్ లతో సీబీఐ, ఈడీ అరెస్ట్ వారెంట్ లపై చర్చిస్తున్నారు. మెుత్తానికి ఏక్షణంలోనైనా చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, చిదంబరం అనుచరులు ఆయన నివాసం వద్ద నినాదాలు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ